Advertisement

Advertisement


Home > Politics - Telangana

లుకలుకలకు శ్రీకారం చుట్టిన ఉత్తమ్!

లుకలుకలకు శ్రీకారం చుట్టిన ఉత్తమ్!

కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన మెజారిటీతో తెలంగాణలో అధికారం చేపట్టబోతోంది. పార్టీలో అంతర్గతంగా ఉండే విభేదాలు, ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకునే దురలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ఇలాంటి ఘనమైన విజయం సాధించిందనే అందరూ అనుకుంటున్నారు. 

ఎన్నికలకు చాలా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను ముఠాలను పక్కన పెట్టి.. పనిచేశారు. విజయం సాధించారు. అయితే నిన్న కనిపించిన ఐక్యత అంతా వట్టిదేనా? ఫలితాలు వెలువడిన వెంటనే ఎవరికి వారు తమ తమ సొంత ఎజెండాలను బయటకు తీస్తున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది.

ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడిన తర్వాత.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సీఎల్పీ భేటీ ఇంకా జరగలేదు, ఏఐసీసీ నిర్ణయం బయటకు రాలేదు. 

అయినా సరే.. సహజంగానే పుకార్లు మొదలు కావడం సహజం. ఆ క్రమంలో రేవంత్ పేరు ప్రబలంగా వినిపిస్తోంది. గెలుపు తర్వాత.. గాంధీభవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సారథ్యంలోనే తమ పార్టీ నాయకులందరూ కలిసి పనిచేసి విజయం సాధించామని అన్నారు. తద్వారా.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడిగా ఆయన సంకేతాలు ఇచ్చినట్టుగా పలువురు భావిస్తున్నారు. మీడియాలో కూడా.. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారంటూ కథనాలు వచ్చాయి.

అయితే.. అప్పుడే పార్టీలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ లుకలుకలకు శ్రీకారం చుట్టడం విశేషం. సీఎం ఎవరనే విషయంలో ఏఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అంటున్నారు. అలాగే, ఫలానా వారు సీఎం కాబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు  నిజం కాదని కూడా ఉత్తమ్ అంటున్నారు. తన మనసులో ఎవరున్నారనే విషయాన్ని తాను బయట చెప్పనని కూడా అంటున్నారు.

నిజానికి రేవంత్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డికి తొలినుంచి అభిప్రాయ భేదాలున్నాయనే మాట ఉంది. ఉత్తమ్ ను పక్కకు తప్పించి.. పార్టీ సారథ్యాన్ని రేవంత్ చేతికి అప్పగించింది అధిష్ఠానం. రేవంత్ సారథ్యంలోనే ఇప్పుడు పార్టీకి విజయం దక్కింది. ఈ మధ్యకాలంలో జానారెడ్డి లాంటి వాళ్లు ‘ఏమో నేను సీఎం అవుతానేమో’ లాంటి డైలాగులు వేశారు గానీ.. వారు రేసులో ఉన్నారని అనుకోనక్కర్లేదు. 

రేవంత్ పేరు ప్రచారంలోకి రాగానే.. ఇప్పుడు దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. అధిష్ఠానం వద్ద పట్టు ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో తన భార్యకు కూడా టికెట్ ఇప్పించుకున్నారు. దంపతులు ఇద్దరూ గెలిచారు. అయితే ఇప్పుడు సీఎంగా రేవంత్ కు అడ్డు పడతారా అనే అనుమానం పలువురిలో కలుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?