Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేసీఆర్ కు తెలంగాణా మీదనే డౌట్ ఎందుకు?

కేసీఆర్ కు తెలంగాణా మీదనే డౌట్ ఎందుకు?

తెలంగాణలో కొన్నాళ్లుగా భారీ వర్షాలు కురుస్తూ పలు జిల్లాల్లో వరదలు రావడానికి విదేశాల కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ దుమ్మెత్తి పోస్తున్నాయి. 

కేసీఆర్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని అంటున్నాయి. గోదావరి వరదలు చూస్తుంటే విదేశాలు క్లౌడ్ బరస్ట్ కుట్ర చేశాయేమోనని అనుమానం కలుగుతున్నదని ఆయన తన వరద ప్రాంతాల పర్యటనలో కామెంట్ చేసిన సంగతి తెలిసిందే కదా. కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో అర్ధం కావడంలేదు.

నిజానికి ఈ వరదల పరిస్థితి ఒక్క తెలంగాణలోనే కాదు. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉంది. చివరకు ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. తెలంగాణా విషయానికొస్తే భారీ వర్షాలు కురవడం కొత్త కాదు. మరి అప్పుడెప్ప్పుడూ చేయని కామెంట్స్ కేసీఆర్ ఇప్పుడే ఎందుకు చేశారు? ఏ ఆధారాలతో విదేశాల కుట్ర అన్నారు? ఎవరికీ అర్ధం కావడంలేదు. 

పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రాలోనూ భారీగా వర్షాలు కురిసి వరదలు వచ్చాయి. వరదలు రావడానికి విదేశాలు కుట్ర చేసినట్లు కేసీఆర్ దగ్గర పక్కా సమాచారం ఉంటే కేంద్రానికి సమాచారం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే ఆయనకు మతి భ్రమించినట్లుగా కనబడుతోందని, ఆయన చెప్పిన విదేశాల కుట్ర ఈ శతాబ్దపు పెద్ద జోక్ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 

ఇది ప్రకృతి వైపరీత్యమే తప్ప కుట్ర కాదని శాస్త్రజ్ఞులు అన్నారు. క్లౌడ్ సీడింగ్ అనేది రహస్యంగా చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఏ ఆధారాలతో సీఎం ఈ కామెంట్స్ చేశారన్న చర్చ జరుగుతోంది. పొలిటికల్ మైలేజ్ కోసం చేశారా? విదేశాల కుట్రను మోడీ ప్రభుత్వం సకాలంలో గుర్తించలేక విఫలమైందనే ఉద్దేశంతో చేశారా? లేదా సమస్యల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇలాంటి కామెంట్లు చేశారా? ఉమ్మడి ఏపీలో 2000 దశకంలో తీవ్ర కరువు వచ్చింది. తక్కువ వర్షపాతం నమోదైంది. అప్పుడు మేఘ మథనం ద్వారా కృత్రిమంగా వానలు కురిపించడానికి ప్రయత్నాలు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ కృత్రిమంగా వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు జరిగాయి.

హెలీకాఫ్టర్లను పంపి మేఘాల మీద రసాయనాలు స్ప్రే చేశారు. కానీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ఆ ప్రయత్నాలు నిలిపేశారు. నిర్దిష్ట ప్రాంతంలో కొన్ని గంటల వరకు మాత్రమే కృత్రిమంగా వానలు కురిపించవచ్చుగానీ ఒక రాష్ట్రంలో రోజుల తరబడి వరదలు వచ్చేలా కృత్రిమ వర్షాలు కురిపించడం సాధ్యం కాదు. 

కేసీఆర్ చెప్పినట్లుగానే విదేశాలు కుట్ర చేసి క్లౌడ్ బరస్ట్ కు పాల్పడి ఉంటే విమానాలను, హెలీకాఫ్టర్లను వినియోగించి ఉంటే భారత రాడార్లకు దొరక్కుండా తప్పించుకుంటాయా? వాతావరణ మార్పులవల్లనే ఇలా జరిగింది తప్ప కేసీఆర్ అనుకున్నట్లు కుట్ర జరగడానికి పనిగట్టుకొని తెలంగాణను టార్గెట్ చేయడానికి జరగదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?