Advertisement

Advertisement


Home > Politics - Telangana

బీఆర్ఎస్‌పై వేట మొద‌లెట్టిన ఎల్లో మీడియా!

బీఆర్ఎస్‌పై వేట మొద‌లెట్టిన ఎల్లో మీడియా!

తెలంగాణ‌లో ఎల్లో మీడియా యూట‌ర్న్ తీసుకుంది. బీఆర్ఎస్‌కు అధికారం పోయి, కాంగ్రెస్ చేతికి రాగానే ఎల్లో మీడియా వెంట‌నే రంగులు మార్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ స‌ర్కార్‌కు బాకా వూదింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సీఎం కాగానే కాంగ్రెస్ స‌ర్కార్ ప‌ల్ల‌కీ మోయ‌డానికి సిద్ధం కావ‌డం ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది. అంతా అధికార మ‌హిమ అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

కేసీఆర్ స‌ర్కార్‌లో అవినీతి, అధికార దుర్వినియోగంపై రేవంత్ స‌ర్కార్ వ‌చ్చీరాగానే చ‌ర్య‌ల‌కు దిగింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన మొద‌టి రోజు నుంచే ఇలాంటి చ‌ర్చ‌లు క‌క్ష‌పూరిత‌మైన‌వ‌నే నెగెటివ్ టాక్ తీసుకొస్తుంద‌ని మీడియా హిత‌వు చెబుతుంద‌ని అనుకున్నారు. అబ్బే... అలాంటిదేమీ లేదు. కేసీఆర్‌పై వేట‌, బీఆర్ఎస్ స‌ర్కార్ అవినీతిపై ఉక్కుపాదం అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఆకాశానికెత్తే ప్ర‌య‌త్నాల్ని చూడొచ్చు.

విద్యుత్ రంగానికి సంబంధించి 80 వేల కోట్ల‌కు పైగా అప్పులు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డికి సంబంధించి రూ.10 కోట్ల విద్యుత్ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో నోటీసులు, ఆయ‌న మాల్స్‌కు క‌రెంట్ క‌ట్‌, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు త‌దిత‌ర అంశాల్ని తెర‌పైకి తెచ్చి, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి వేట మొద‌లు పెట్టిన‌ట్టు సంబ‌ర‌ప‌డుతూ క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేయ‌డంతో పాటు చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇదే ఎల్లో మీడియా కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం వీరుడు, శూరుడు అంటూ తెగ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో మంత్రులు హ‌రీష్‌రావు, కేటీఆర్‌ల‌ను స్టూడియోల‌కు పిలిపించుకుని... తాము జ‌ర్న‌లిస్టుల‌మ‌నే సంగ‌తి మ‌రిచిపోయి, ఆకాశ‌మే హ‌ద్దుగా వారిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి, నేడు తెగ‌డ్త‌ల‌తో బ‌ద్నాం చేయ‌డంపై ప్ర‌జానీకం ముక్కున వేలేసుకుంటోంది. ఔరా, ఎంత‌లో ఎంత మార్పు అని జ‌నం చ‌ర్చించుకుంటున్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం సీఎం, మంత్రులు, ఇత‌ర అధికార పార్టీ నేత‌ల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగి, ఇప్పుడు అదే పార్టీకి వ్య‌తిరేకంగా డిబేట్లు నిర్వ‌హిస్తుండ‌డం ఎల్లో మీడియాకే చెల్లించ‌ద‌నే టాక్ న‌డుస్తోంది. సొంత ప్ర‌యోజ‌నాల కోసం జ‌ర్న‌లిజాన్ని ఇష్టానుసారం వాడుకుంటున్నార‌ని జ‌నం అనుకుంటున్నారు. రేపు రేవంత్‌రెడ్డి అధికారం అటూఇటూ అయితే, ఎల్లో మీడియా మ‌ళ్లీ ఇదే వ‌రుస అని విమ‌ర్శిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?