అమరావతిలో ఆందోళన.. అసలు టార్గెట్ వారేనా?

మరో 10 రోజుల్లో అమరావతి ఉద్యమం ఏడాది మైలురాయికి చేరుకుంటుంది. ఈ దశలో ఆందోళనల స్థాయి పెంచాలని, రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాలనేది ఉద్యమకారులుగా చెప్పుకుంటున్న రాజకీయ ప్రేరేపిత శక్తుల అభిమతం. దానికి అనుగుణంగానే…

మరో 10 రోజుల్లో అమరావతి ఉద్యమం ఏడాది మైలురాయికి చేరుకుంటుంది. ఈ దశలో ఆందోళనల స్థాయి పెంచాలని, రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాలనేది ఉద్యమకారులుగా చెప్పుకుంటున్న రాజకీయ ప్రేరేపిత శక్తుల అభిమతం. దానికి అనుగుణంగానే రెండు రోజుల క్రితం చంద్రబాబు దీక్షా శిబిరానికి వెళ్లి.. అందర్నీ రెచ్చగొట్టారు. ఆ తర్వాత మిగతా పని బాబు అనుకూల మీడియా చూసుకుంటోంది.

కట్ చేస్తే.. 'రాజధాని మహిళలపై రాళ్లదాడి' అంటూ ఈనాడు మెయిన్ పేజీ వార్త రాసింది. అమరావతికి అనుకూలంగా ఆందోళనలు చేస్తున్న రైతులపై.. మూడు రాజదానుల మద్దతుదారులు దాడి చేశారని, ఇద్దరు మహిళలు ఈ దాడిలో గాయపడ్డారని, అమరావతి ఆందోళనలతో అట్టుడికి పోతోందనేది ఆ వార్త సారాంశం.

అసలింతకీ ఏం జరిగింది..?

'ఇంటింటికీ అమరావతి' పేరుతో మహిళలకు బొట్టు పెట్టి అమరావతి ఆవశ్యకతను చాటి చెప్పే కార్యక్రమాన్ని చేపట్టారు రాజధాని మహిళా రైతులు. ఉద్దండరాయుని పాలెంలో ఎంపీ నందిగం సురేశ్ ఇంటి వద్ద కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. చుట్టుపక్కల ఇళ్లవారికి బొట్టుపెట్టి వచ్చారు.

ఈలోగా ఎంపీ ఇంటిపై అమరావతి రైతులు దాడి చేస్తున్నారనే సమాచారంతో బహుజన పరిరక్షణ సమితి నేతలు అటువైపు దూసుకొచ్చారు. వీరంతా మందడంలో మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళన చేస్తున్నవారు. వీరి రాకతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత అందరూ ఉద్దండరాయునిపాలెంలోని అమరావతి అనుకూల దీక్షా శిబిరంవైపు వచ్చారు.

ఓ దశలో అమరావతి అనుకూల, వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. పరిస్థితి చక్కబడుతోందనుకుంటున్న దశలో.. గుర్తు తెలియని వ్యక్తులు అమరావతి శిబిరం వైపు రాళ్లు విసిరారు. ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారు రాస్తారోకో చేపట్టారు. తమపై మూడు రాజధానుల శిబిరం మద్దతుదారులు దాడి చేశారంటూ ఆందోళనకు దిగారు.

వాస్తవానికి దాడి చేసిందెవరో ఎవరికీ తెలియదు. కానీ రాజధాని మహిళలకు స్వల్ప గాయాలు కావడాన్ని బాబు అనుకూల మీడియా హైలెట్ చేసింది. రాజధాని మహిళలపై రాళ్లదాడి అంటూ వార్త వచ్చేసింది. ఇంకేముంది అమరావతినుంచి రాజధానిని తరలించడమే కాదు, అక్కడ మనుషుల్ని కూడా బతకనీయడం లేదంటూ మరో తోకపత్రిక కథనాలు వండి వార్చింది. ఎంపీ నందిగం సురేష్ అనుచరులే దాడికి పాల్పడ్డారని కట్టుకథలల్లింది.

మొత్తమ్మీద.. అమరావతి ఉద్యమం ఏడాది మైలురాయికి చేరుకుంటున్న దశలో.. పచ్చ బ్యాచ్, ఎల్లో మీడియా ఉద్రిక్త వాతావరణాన్ని కోరుకుంది, దానికి తగ్గట్టే అగ్గిరాజేసింది. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహిస్తున్న శిబిరాన్ని ఖాళీ చేయించడమే వారి అసలు టార్గెట్ అనే విషయం మరోసారి తేలిపోయింది. 

పవర్ స్టార్ పేరెత్తగానే