తమ్ముళ్ళదీ అదే రాజకీయమ‌ట…!

రాజకీయం లేనిదే ఏ నాయకుడు అంగుళం అడుగు కూడా కదలడు అన్నది నవీన ప్రజాస్వామిక  సూత్రం. మరి దాన్ని అనుసరిస్తున్న వారే ఇపుడు మేటి నాయకులుగా చలామణీ అవుతున్నారు. ఇక కొన్నేళ్ళ క్రితం ఉమ్మడి…

రాజకీయం లేనిదే ఏ నాయకుడు అంగుళం అడుగు కూడా కదలడు అన్నది నవీన ప్రజాస్వామిక  సూత్రం. మరి దాన్ని అనుసరిస్తున్న వారే ఇపుడు మేటి నాయకులుగా చలామణీ అవుతున్నారు. ఇక కొన్నేళ్ళ క్రితం ఉమ్మడి ఏపీ రెండు ముక్కలుగా విడిపోతుందనుకున్న సందర్భంలో టీడీపీ అధినేత బాబు తెలివిగా రెండు కళ్ళ  సిధ్ధాంతాన్ని ముందుకు తెచ్చారు.

తన పార్టీని, రాజకీయాన్ని కాపాడుకునేందుకు ఆయన తనకు ఆంధ్రా, తెలంగాణా రెండు కళ్ళు అంటూ కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. అయితే రెండు కళ్ళు అయినా చూసే  చూపు ఒక్కటే  అని, అలా చెరో వైపు కళ్ళు చూస్తే అది అంధకారమే  అవుతుందని నాడు ఉద్యమకారులు గట్టిగానే సెటైర్లు వేశారు, చివరకు ఫలితాలూ అలాగే వచ్చాయి.

ఇపుడు ఏపీలో జగన్ మూడు రాజధానుల కధ కూడా టీడీపీని అలాగే ముందుకు నడిపిస్తోందని అంటున్నారు. అధినేత బాబు అమరావతి అంటూంటే కొంతమంది తమ్ముళ్ళు జై విశాఖపట్నం అంటున్నారు. మరి దీనివెనక మతలబు ఏంటీ అంటే అదంతా ఫక్త్ రాజకీయమేనని తేల్చేస్తున్నారు ఆ పార్టీలో నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి. తమకు తామే గోయి తీసుకుని ఏ నాయకుడు అందులో పడిపోడు కదా, తనకు ఓట్లేసిన ప్రజల విషయంలో వారి పాటే తానూ పాడుతాడంటూ సబ్బం అంటున్నారు.

విశాఖ జనం మద్దతు కోసం తమ పార్టీ తమ్ముళ్ళు కూడా విశాఖ రాజధానిని బయటకు సమర్ధిస్తున్నా వారి మనసులో  మాత్రం అమరావతే ఉందని కూడా సీక్రెట్ చెబుతున్నారు. ఈ సంగతి బాబుకు తెలుసు అని అందుకే ఆయన జై విశాఖ అని కొంతమంది పెద్ద నాయకులు అంటున్నా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడంలేదని కూడా సబ్బం అసలు గుట్టు విప్పారు.

అంటే నాడు రెండు కళ్ళ సిధ్ధాంతం, నేడు మూడు కళ్ళ సిధ్ధాంతమా అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్న కూడా తమ్ముళ్ళు బాబు చెప్పినట్లుగాన వింటూనే బయటకు మాత్రం మొక్కుబడిగా జై విశాఖ అంటున్నారుట. మరి ఈ మూడు కళ్ళ సిధ్ధాంతం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే.

‘ఎల్లో’ వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం