ఊపిరి సలపని షెడ్యూలు

ప్రత్యర్థికి ఊపిరి సలపనివ్వకూడదు. ఆలోచనకు సమయం వుండకూడదు. తాము అంతా రెడీగావుండాలి. అవతలివారు కిందా మీదా అయిపోవాలి. సాధారణంగా ఎన్నికల విషయంలో అధికార పక్షం ఇలాగే ఆలోచిస్తుంది. Advertisement సమయం అనుకూలంగా వుందీ అంటే…

ప్రత్యర్థికి ఊపిరి సలపనివ్వకూడదు. ఆలోచనకు సమయం వుండకూడదు. తాము అంతా రెడీగావుండాలి. అవతలివారు కిందా మీదా అయిపోవాలి. సాధారణంగా ఎన్నికల విషయంలో అధికార పక్షం ఇలాగే ఆలోచిస్తుంది.

సమయం అనుకూలంగా వుందీ అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తుంది. తెలంగాణ సిఎమ్ కేసిఆర్ కు ఇది అలవాటే. ఇప్పుడు అదే అలవాటను హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా చూపించారు.

ఇవ్వాళో, రేపో అనుకుంటూ వుండగానే జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూలును ప్రకటించేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎలా..
ప్రకటించింది…17న
నామినేషన్లకు చివరి రోజు 20
ఉపసంహరణ…24న
పోలింగ్…1న
ఫలితాలు…4న

….
అంటే షెడ్యూలు వచ్చింది అని చూసి,ప్రతిపక్ష పార్టీలు సమావేశం కావాలంటేనే కనీసం కొన్ని గంటలు పడుతుంది. వంద స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాలి. వారికి చెప్పాలి. వారు తగిన డాక్యుమెంట్లు రెడీ చేసుకుని నామినేషన్లు వేయాలి.

ఇవన్నీ జస్ట్ 18,19,20 తేదీల్లో జరిగిపోవాలి. ఆ తరవాత పదే పది రోజుల్లో ప్రచారం జరుపకోవాలి. ఈలోగానే నిధులు సర్దుబాటు చేసుకోవాలి. ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలకు కాస్త కష్టమైన పనులే. అధికారం పక్షం ఎప్పుడో రెడీగా వుందని, అభ్యర్థుల జాబితా ఏనాడో ఖరారు చేసి పక్కన పెట్టారని రాజకీయ వర్గాల బోగట్టా. 

ఇప్పటికే తెలుగుదేశం, జనసేన బరిలోకి దిగుతాము అంటున్నాయి. జనసేన విడిగా దిగుతుందా? భాజపాతో పొత్తు వుంటుందా? అన్నది తెలియదు. ఎందుకంటే నిన్నటికి నిన్న వదిలిన ప్రెస్ నోట్ లో ఆ విషయం అస్సలు లేదు. జనసేన, తెలుగుదేశం విడిగా పోటీ చేస్తే తెరాసకే బెటర్. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును భాజపాతో కలిసి ఆ రెండు పార్టీలు పంచుకుంటాయి.

అలాగే ఆంధ్ర ఓట్లు ఏమైనా వుంటే అవి కూడా ఈ రెండు పార్టీలు తీసుకుంటాయి. అప్పుడు తెరాసకే లాభం అవుతుంది. అసలు తెరాసకు లాభం చేయడానికే తెలుగుదేశం, జనసేన బరిలోకి దిగుతున్నాయనే గుసగుసలు కూడా వున్నాయి.

మొత్తం మీద ఓ రెండు వారాల పాటు జంటనగరాల్లో సందడే సందడి. 

జగన్ వెనకడుగు అందుకేనా?