ఎంపీని చేసినందుకు ఇదా మర్యాద చిన్నమ్మా…!?

దగ్గ్గుబాటి పురంధేశ్వరి. నిజానికి ఈ పేరు పెట్టుకుని విశాఖలో పోటీ చేస్తే మంచి నీళ్ళు కూడా పుట్టకూడదు, కానీ ఆమె నందమూరి వారి  ఆడపడుచు. అన్నింటికీ మించి అన్నగారి ముద్దుల కూతురు.  అందువల్లనే ఆమె…

దగ్గ్గుబాటి పురంధేశ్వరి. నిజానికి ఈ పేరు పెట్టుకుని విశాఖలో పోటీ చేస్తే మంచి నీళ్ళు కూడా పుట్టకూడదు, కానీ ఆమె నందమూరి వారి  ఆడపడుచు. అన్నింటికీ మించి అన్నగారి ముద్దుల కూతురు.  అందువల్లనే ఆమె క్రిష్ణా జిల్లాలో పుట్టినా, ప్రకాశం జిల్లా మెట్టినిల్లు అయినా కూడా విశాఖవాసులు నిండు మనసులో ఆదరించారు, ఆశీర్వదించారు.

నిజానికి 2004లో సొంత జిల్లాలో గెలిచిన చిన్న‌మ్మకు 2009 ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేసేందుకు అవకాశం లేకపోతే విశాఖలో అకామిడేట్ చేశారు. ఎందువల్ల అంటే విశాఖ వాసులు విశాల హ్రుదయం కలిగిన వారని, ఎవరు ఎక్కడ నుంచి వచ్చినా అక్కున చేర్చుకుంటారని. 

నిజానికి ఆ విధంగానే జరిగింది. ఓ వైపు లోక్ సభ పోటీలో ప్రజారాజ్యం నుంచి లోకల్ నాయకుడు, బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ లాంటి వారు, మెగా ఇమేజ్ తోడుగా ఉన్నా కూడా అరవై వేల మెజారిటీతో చిన్నమ్మ నెగ్గి ఎంపీ అయిపోయారంటే ఆమె మీద,ఆమె తండ్రి నందమూరి వారి మీద అభిమానంతోనేనన్నది వాస్తవం.

ఇక ఇలా ఎంపీ అయ్యారో లేదో అలా చిన్నమ్మ కేంద్ర మంత్రి కూడా అయిపోయారు. అయిదేళ్ళ పాటు విశాఖవాసులకు ఆమె చేసింది శూన్యం. ఆమె విశాఖ రాకపోకలు సైతం విశాఖవాసులకు అరుదైన ముచ్చటగానే ఉండేవి.

ఇంత చేసిన విశాఖకు ఆమె కేంద్ర మంత్రిగా ఏమీ చేయకపోగా ఇపుడు విషం చిమ్ముతూండడమే ఇక్కడ ప్రజలను బాధిస్తోందని అంటున్నారు. చిన్నమ్మ వంటి వారు నాడు ఏమాత్రం పోరాడారో కానీ ఏపీ విభజనను మాత్రం ఆపలేకపోయారు. రెండు ముక్కలు చేసిన పుణ్యం కూడా కట్టుకున్నారు.

ఇపుడు అయిదేళ్ళుగా ఉసూరుమంటున్న ఉత్తరాంధ్ర అభివ్రుధ్ధి కోసం వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన చేస్తే వద్దే వద్దు అంటున్న్నారు చిన్నమ్మ. విశాఖలో పరిపాలనా రాజధానిని పెడతానని జగన్ సర్కార్ అంటూంటే ససేమిరా వీలులేదని చిన్నమ్మ వంటి వారు అంటున్నారంటే ఆదరించి ఓటేసిన విశాఖ జనాల పట్ల ఎంతటి ప్రేమాభిమానాలు చూపుతున్నారో అర్ధమవుతోందిగా.

అమ్మ పెట్టాపెట్టడు, అడుక్కుతినానివ్వదు అన్నట్లుగా ఈ చిన్నమ్మ విశాఖకు చేసిన మేలు ఏదీ లేదు, ఇపుడు వేరే వారు అభివ్రుధ్ధి చేస్తామంటున్నా ఊరుకునేలా లేరు అని సెటైర్లు పడుతున్నాయంటే లోపమెక్కడ ఉందో ఎన్టీయార్ తనయ మనసు పెట్టి ఆలోచించుకుకోవాల్సిందేగా.