మహేష్ డ్రాప్ అయ్యాడు.. బాలయ్య ఏం చేస్తాడో!

మహేష్ కు చాలా పెద్ద సెంటిమెంట్ ఉంది. తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ (ఫస్ట్ లుక్ లేదా  టీజర్) ఇవ్వడం మహేష్ కు అలవాటు.…

మహేష్ కు చాలా పెద్ద సెంటిమెంట్ ఉంది. తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ (ఫస్ట్ లుక్ లేదా  టీజర్) ఇవ్వడం మహేష్ కు అలవాటు. కానీ ఈ ఏడాది మాత్రం ఆ సెంటిమెంట్ ను పక్కనపెట్టేశాడు మహేష్. కరోనా కల్లోలంలో కొత్త సినిమా సందడి చేయడం సరైన పద్ధతి కాదంటూ తప్పుకున్నాడు. మరి బాలయ్య ఏం చేయబోతున్నాడు?

సరిగ్గా వారం రోజుల్లో బాలయ్య పుట్టినరోజు వస్తుంది. ఈ నటుడు కూడా అంతే. తన పుట్టినరోజు నాడు సినిమాలకు సంబంధించి ఏదో ఒక హంగామా చేస్తాడు. మరి ఈ ఏడాది తన పుట్టినరోజుకు బాలయ్య ఏవైనా అప్ డేట్స్ ఇస్తాడా? లేక మహేష్ లానే సైడ్ అవుతాడా?

అఖండ కాకుండా బాలయ్య చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఒకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా కాగా.. ఇంకోటి అనీల్ రావిపూడి డైరక్షన్ లో రావాల్సిన సినిమా. గోపీచంద్ మలినేని సినిమా ఫిక్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక మిగిలిన అనీల్ రావిపూడి సినిమా ప్రకటనే బాలయ్య బర్త్ డేకి వస్తుందనే టాక్ నడుస్తోంది.

మొత్తమ్మీద అఖండతో కలిపి బాలయ్య చేతిలో ఉన్న 3 సినిమాల్లో.. ఏదో ఒక సినిమా నుంచి ఆయన పుట్టినరోజు నాడు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రకటనలు వచ్చినా రాకపోయినా, ఆయన ఆ రోజున మరో పాట పాడకుండా ఉంటే అదే చాలు.