మితిమీరుతున్న ఈనాడుకి సుతిమెత్తని కౌంటర్లు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తనకు వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా వార్తలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఒకే గాటన కట్టినా… జగన్ హయాంలో మాత్రం కాస్త తేడా చూపించారు. Advertisement ఈనాడు…

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తనకు వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా వార్తలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఒకే గాటన కట్టినా… జగన్ హయాంలో మాత్రం కాస్త తేడా చూపించారు.

ఈనాడు అబద్ధాలు, అర్థ సత్యాలు రాసినా, కాస్త పొలైట్ గా ఉండేవి, ఆంధ్రజ్యోతిది మరీ బరితెగింపు. అయితే అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో మాత్రం పూర్తిగా జ్యోతిని పక్కనపెట్టింది వైసీపీ ప్రభుత్వం. దీంతో దాని ఆర్థిక మూలాలు బాగా దెబ్బతిన్నాయి.

ఇక ప్రభుత్వం ఇచ్చే కోట్ల రూపాయల ప్రకటనలతో నెట్టుకొస్తున్న ఈనాడు.. పూర్తిగా చంద్రబాబుకి కొమ్ముకాయడం ఎంతవరకు కరెక్ట్. ప్రభుత్వానికి వంతపాడాలని చెప్పట్లేదు కానీ, కనీసం వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈనాడుకి లేదా? ప్రభుత్వ ప్రకటనల ద్వారా మనుగడ సాగిస్తున్న మీడియా.. ఆ ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కదా. 

ఆ బాధ్యత గుర్తు చేయడానికే వరసబెట్టి మంత్రులు ఈనాడుని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. పెట్రోలు రేట్లు పెరిగిన సందర్భంలో ఈనాడు ఇచ్చిన ఆర్టికల్ ని తీవ్రంగా దుయ్యబట్టారు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.

రోడ్ల మరమ్మతుల కోసమే లీటర్ కి రూపాయి పెంచారనే విషయాన్ని తొక్కిపెట్టి, కరోనా కష్టకాలంలో ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ విషం చిమ్మింది ఈనాడు. గతంలో పెట్రోలు రేట్లు పెంచినప్పుడు కిక్కురుమనకుండా ఉన్న ఈనాడు, ఇప్పుడే ఎందుకిలా రెచ్చిపోతోందని ప్రశ్నించారు మంత్రులు.

చంద్రబాబు పెట్రోల్ పై అమరావతి సెస్ వేశారు. అప్పుడు ప్రజలు సంతోష పడ్డారని, మరో రెండు రూపాయలు అదనంగా వేసినా పర్వాలేదని అనుకున్నారని ఈనాడు కథనాలు వండి వార్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నా.. కేంద్రం పలు దఫాలు ఇంధన రేట్లు పెంచింది. దీనిపై కూడా ఈనాడు స్పందించలేదు. కారణం ప్రధాని మోడీ చల్లని చూపు రామోజీకి అవసరం. అక్కడ స్క్రూ బిగిస్తే.. ఇక్క రామోజీ ఫిలిం సిటీ కూసాలు కదిలిపోతాయి. అందుకే ఆయన విషయంలో అతి వినయం.

అటు కేసీఆర్ పాలనపై కూడా ఎప్పుడూ రామోజీ పల్లెత్తు మాట అనలేదు. పొరపాటున ఏమైనా అంటే లక్ష నాగళ్లు ఫిలింసిటీలోకి వచ్చేస్తాయని మరో భయం. జగన్ ఏమీ చేయలేదు, చేయరు అనే అలుసుతోటే ఈనాడు రెచ్చిపోతోందని విమర్శించారు మంత్రులు. ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసినా, ఎన్నికల తర్వాత వ్యతిరేక వార్తలు రాస్తున్నా.. ఉదారంగా ప్రకటనలు ఇస్తున్నారు కాబట్టే జగన్ పై దాడి జరుగుతోందన్నారు.

ఇకనైనా బాధ్యతగా వార్తలు రాయాలని హితవు పలికారు మంత్రులు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ అనే పేరు చెప్పడానికే మంత్రులు అసహ్యించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనాడు కూడా మరీ బరితెగిస్తుండే సరికి బాధ్యత గుర్తు చేశారు. రామోజీ గారూ.. మీకు అర్థమౌతోందా..?

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు

చిరంజీవి ఎప్పుడూ లేనంతగా ఏడ్చారు