వైసీపీ ఎమ్మెల్యేలో కళాకారుడు

ఓమారు ముఖ్యమంత్రి జగన్ నిండు అసెంబ్లీలో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలలో అనేకమంది విద్యావంతులు ఉన్నారని, డాక్టర్లు, న్యాయవాదులతో పాటు వివిధరంగాల ప్రముఖులు ఉన్నారని చెప్పుకొచ్చారు. Advertisement అయితే వైసీపీలో కళాకారులు కూడా బాగానే ఉన్నారు.…

ఓమారు ముఖ్యమంత్రి జగన్ నిండు అసెంబ్లీలో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలలో అనేకమంది విద్యావంతులు ఉన్నారని, డాక్టర్లు, న్యాయవాదులతో పాటు వివిధరంగాల ప్రముఖులు ఉన్నారని చెప్పుకొచ్చారు.

అయితే వైసీపీలో కళాకారులు కూడా బాగానే ఉన్నారు. అవకాశం రావాలే కానీ దున్నేస్తామని అంటున్నారు. విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలో మంచి నటుడు ఉన్నాడు. ఆయన తనదైన నటనను ఎపుడు వీలు చిక్కినా ప్రదర్శిస్తారు కూడా.

ఆయనకు చిన్నతనం నుంచే వేదికలు ఎక్కి నాటకాలు వేయడం అలవాటు, ఇక ఆయనలోని నటనాభివేశం కూడా రాజకీయాల్లో రాణించేందుకు బాగా ఉపయోగపడుతూ వచ్చింది. అందరూ ప్రసంగాల ద్వారా చెప్పే విషయాలను ఆయన తన కళ ద్వారా జనాలకు చేర్చి వారి మెప్పు పొందుతూ వచ్చారు.

ఆయన పద్యాలు కూడా బాగా ఆలపిస్తారు. మంచి గొంతు కూడా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే 2004లో కాంగ్రెస్ టికెట్ మీద మాడుగుల నుంచి తొలిసారి గెలిచిన ధర్మశ్రీ ఏకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముందే తన కళాభినివేశాన్ని ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు.

అప్పట్లో హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు నిర్వహించిన సాంస్క్రుతిక కార్యక్రమాల్లో అన్నమయ్య పాత్రధారిగా వచ్చి వైఎస్సార్ మెప్పు సంపాందించారు.  ఇపుడు విశాఖ జిల్లా గిరిజనుల ఆరాధ్య‌ దేవత అయిన మోదకొండమ్మ అమ్మవారి మీద తీస్తున్న భక్తిరస ప్రధానమైన సినిమాలో ధర్మశ్రీ నటిస్తున్నారు.

ఇందులో పరమశివుడి పాత్రలో ధర్మశ్రీ నటిస్తున్నారు. ఈ మూవీని విశాఖ పరిసరాలలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను పూర్తి చేసి మోదకొండమ్మ భక్తులకు, ఆస్తిక జనులకు అంకితం ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఏది ఏమైనా రాజకీయ నేతగా మంచి వాగ్దాటి ప్రదర్శించే ధర్మశ్రీలోని కళాకారుడు కూడా అలరించే అభినయం అందించడం విశేషమే.

జగనన్నని అడిగి నర్సాపురం సీటు తెచుకుంటా

ఆర్జీవీ చాలా తెలివైనోడు