బాబు మ‌న‌వ‌డి సేవ‌లో ఎల్లో ప‌త్రిక ప‌ర‌వ‌శం

టీడీపీ అధినేత చంద్ర‌బాబే కాదు లోకేశ్‌బాబు సేవ‌లో కూడా త‌రిస్తున్న ఆ ఎల్లో ప‌త్రిక‌కు త‌నివి తీర‌న‌ట్టుంది. తాజాగా లోకేశ్ కుమారుడు, బాబు మ‌న‌వ‌డైన దేవాన్స్‌ను కూడా ఆ ప‌త్రిక‌ విడిచిపెట్ట‌లేదు. దేవాన్ష్ దేవాన్ష్…

టీడీపీ అధినేత చంద్ర‌బాబే కాదు లోకేశ్‌బాబు సేవ‌లో కూడా త‌రిస్తున్న ఆ ఎల్లో ప‌త్రిక‌కు త‌నివి తీర‌న‌ట్టుంది. తాజాగా లోకేశ్ కుమారుడు, బాబు మ‌న‌వ‌డైన దేవాన్స్‌ను కూడా ఆ ప‌త్రిక‌ విడిచిపెట్ట‌లేదు. దేవాన్ష్ దేవాన్ష్ అంటూ దేవుని మాదిరిగా భావించి కీర్తిస్తోంది.

ఇదే ప‌త్రిక ఈ రోజు ఎడిట్ పేజీలో లోకేశ్ పేరుతో ఓ వ్యాసాన్ని కూడా ప్ర‌చురించి అక్ష‌ర పూజ చేసుకుంది. అది చాల‌ద‌న్న‌ట్టు లోకేశ్ కుమారుడి గురించి ఇప్ప‌టి నుంచే కీర్తించ‌డం మొద‌లు పెట్టింది. దేవాన్ష్ సేవ‌లో ప‌త్రిక య‌జ‌మాని ఎంత‌గా ప‌ర‌వ‌శిస్తున్నారో…వెబ్‌సైట్‌లో రాసిన క‌థ‌నాన్ని చదివితే అర్థ‌మ‌వుతుంది.

‘చంద్రబాబు శుక్రవారం నాడు జూమ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. బాబు మాట్లాడుతుండా ఆయన మనవడు దేవాన్ష్ సడన్‌‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాతయ్య ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడుతున్నట్లు తెలుసుకున్న బుడ్డోడు కెమెరా కంటపడకుండా తిన్నగా కింద పాకుతూ పక్కకు జరిగాడు. చంద్రబాబు వెనుకవైపు సెల్ఫ్‌లో బుక్‌ తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ బుక్ పేరు ‘అక్బర్ బీర్బల్’ కథలు. ఈ వీడియో క్లిప్‌ను కట్ చేసిన తెలుగు తమ్ముళ్లు, అభిమానులు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. నిజంగా లోకేశ్‌ కుమారుడు ఈ వయస్సులో ఇంత క్రమశిక్షణతో మెలుగుతున్నాడంటే నిజంగా గ్రేటే అని అభి మానులు చెప్పుకుంటున్నారు’ …ఇదీ ఆ ప‌త్రిక బానిస స్వ‌భావం.

అంత‌టితో ఈ ప‌త్రిక కీర్త‌న‌లు ఆగ‌లేదు. ఈ వయస్సుకే ఇంత పరిపక్వత అంటే మామూలు విషయం కాదు  అని టీడీపీ వీరాభిమాని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడంటూ ఆ ప‌త్రిక‌ త‌న భ‌క్తిని చాటుకొంది. ఇలా పొగిడి పొగిడే చంద్ర‌బాబును భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని, ఆయ‌న కుమారుడు లోకేశ్‌ను ఎందుకూ ప‌నికి రాకుండా చేశార‌ని టీడీపీ శ్రేణులు స‌ద‌రు ప‌త్రిక‌ను ఆడిపోసుకుం టున్నాయి.

ఇక బాబు మ‌న‌వ‌డిపై క‌న్ను ప‌డింద‌ని, ఆ బుడ్డోడ్ని ఏం చేస్తారోన‌ని టీడీపీ శ్రేణులు విమ‌ర్శిస్తున్నాయి. మ‌రీ ఇంత ఓవ‌రాక్ష‌నా అంటున్న వారు లేక‌పోలేదు.

ఇదీ జగన్ విజన్

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే