Advertisement

Advertisement


Home > Special News - Health

అర్థరాత్రి ఆకలేస్తే ఏం చేయాలి?

అర్థరాత్రి ఆకలేస్తే ఏం చేయాలి?

అర్థరాత్రి ఆకలి సర్వసాధారణం. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. మరీ ముఖ్యంగా బరువు తగ్గడం కోసం రోజంతా తక్కువ ఆహారం తీసుకునే వాళ్లు.. అర్థరాత్రి వేళ ఈ సమస్యను మరింత ఎక్కువగా ఫేస్ చేస్తారు. ఇలాంటి వాళ్లకు ఆకలితో నిద్ర పట్టదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏది పడితే అది తినొచ్చా? అర్థరాత్రి వేళ ఎలాంటి ఆహారం తింటే మంచిది?

మిడ్ నైట్ మీల్స్ పై న్యూటిషనిస్టులు ప్రత్యేకమైన సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే, అర్థరాత్రి వేళ జీర్ణక్రియ కాస్త నెమ్మదిగా సాగుతుంది. శరీరంలో జీవక్రియలన్నీ నెమ్మదిగా జరుగుతుంటాయి. ఇలాంటి టైమ్ లో నాన్-వెజ్ వంటకాలు, మసాలాలు-నూనెలు దట్టించిన ఆహార పదార్థాలు అస్సలు తినకూడదని సూచిస్తున్నారు నిపుణులు.

అర్థరాత్రి పూట ఆకలి వేసినప్పుడు తృణధాన్యాలకు మించిన ఆహార పదార్థాలు లేవంటున్నారు. తృణధాన్యాలతో చేసిన స్నాక్స్ ను మిడ్-నైట్ మీల్ కింద తినడానికి ఉత్తమమైనవిగా చెబుతున్నారు. అయితే ఇవే తృణధాన్యాలతో చిప్స్ లాంటివి చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. డీప్ ఫ్రై చేసిన అలాంటి చిప్స్ మాత్రం తినకూడదు.

ఇక అర్థరాత్రి తినడానికి మరో బెస్ట్ ఆప్షన్ పండ్లు. రాత్రిపూట ఆకలి వేసినప్పుడు పండ్లు తింటే అన్ని విధాలుగా మంచిది. తక్కువ కెలొరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి దాదాపు అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. అయితే కాస్త పుల్లగా ఉండే పైనాపిల్, ద్రాక్ష లాంటి పండ్లను మాత్రం దూరం పెట్టాలని సూచిస్తున్నారు. మిడ్ నైట్ ఇవి తీసుకోవడం వల్ల పొట్టలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి.

ఇంట్లో పెరుగు ఉంటే చాలు, అర్థరాత్రి ఆకలిని తరిమికొట్టొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగులో ఓట్స్ లేదా ఫ్రూట్స్ కలుపుకొని లాగించేయొచ్చు. మార్కెట్లో దొరికే యోగార్ట్ రకాలు అందుబాటులో ఉంచుకున్నా సరిపోతుంది. కాకపోతే పెరుగు మరీ పుల్లగా ఉండకుండా చూసుకోవాలి.

అసలు ఇవేవీ లేనప్పుడు.. ఓట్స్ లేదా రాగులతో తయారుచేసిన బిస్కెట్ ప్యాకెట్లను ఇంట్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా ఇనిస్టెంట్ గా తినాలనిపిస్తే డ్రై ఫ్రూట్స్ అందుబాటులో పెట్టుకోవాలని చెబుతున్నారు.  

త్వరలోనే తెలుగులో మాట్లాడుతా

ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?