Advertisement

Advertisement


Home > Special News - Health

డైటింగ్ టైమ్ లో కాఫీ తాగొచ్చా?

డైటింగ్ టైమ్ లో కాఫీ తాగొచ్చా?

బరువు తగ్గడం కోసం డైటింగ్ చేసే టైమ్ లో ఏం తినాలి, ఏం తినకూడదు అనే అంశంపై చాలామందికి అవగాహన ఉంటుంది. అయితే ఆ టైమ్ లో కాఫీ తాగొచ్చా.. తాగకూడదా అనే అంశంపై మాత్రం చాలామందికి అవగాహన ఉండదు. దీనికి కారణం కాఫీలో చాలా రకాలు ఉండడమే.

బరువు తగ్గడం కోసం ఉపవాసం చేస్తుంటారు కొంతమంది. ఆ టైమ్ లో భోజనానికి ప్రత్యామ్నాయంగా కాఫీ తాగుతుంటారు. అయితే ఫాస్టింగ్ టైమ్ లో రెగ్యులర్ కాఫీ తాగడం వల్ల ఉపయోగం ఉండదంటున్నారు డైటీషియన్లు. ఆ టైమ్ లో బ్లాక్ కాఫీ తాగాలని సూచిస్తున్నారు.

నిజానికి బ్లాక్ కాఫీని అన్ని వేళలా తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు. ఈ తరహా కాఫీల్లో అటుఇటుగా 2-3 కెలొరీల ఎనర్జీ మాత్రమే ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే ప్లాన్ లో ఉన్నవాళ్లు.. నిరభ్యంతరంగా బ్లాక్ కాఫీ తాగొచ్చు. అయితే ఇందులో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి.

రోజులో 3 కప్పులు మించి బ్లాక్ కాఫీ తాగకూడదు. పైగా ఇందులో ప్రొటీన్స్, మినరల్స్ కూడా తక్కువగానే ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. కేవలం బ్లాక్ కాఫీ మీద ఆధారపడితే శరీరానికి కావాల్సిన మినరల్స్ మిస్ అవుతామని చెబుతున్నారు. సో.. ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని బ్లాక్ కాఫీ తాగితే మంచిది. 

పవన్ ఓ మానసిక రోగి

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?