Advertisement

Advertisement


దొరికినంతా దోచుకో.. దోచుకుంది దాచుకో..!

దొరికినంతా దోచుకో.. దోచుకుంది దాచుకో..!

మనకు క్రెడిట్ కార్డు కావాలంటే సవాలక్ష ప్రశ్నలు వేస్తారు బ్యాంకు అధికారులు. అందులో కూడా కొన్ని కేటగిరి వాళ్లకు అస్సలు క్రెడిట్ కార్డులు కూడా ఇవ్వమని మొఖం మీదనే చెబుతారు. కాని ఒక వ్యక్తి ఒక నకీలీ కంపెనీ పెట్టి అందులో ఉద్యోగులు వున్నారని చూపెట్టి క్రెడిట్ కార్డులను కొట్టేస్తున్నాడు. ఈ క్రెడిట్ కార్డుల నుంచి ఏకంగా కోట్ల రూపాయలను తీసుకున్న తీరు ఇది. మొత్తం 41మంది ఉద్యోగుల పేరు మీద క్రెడిట్ కార్డులను తీసుకుని వాటినుంచి డబ్బులు డ్రా చేసుకున్న తీరు ఇది. 

హైదరబాద్ నార్త్ జోన్ టాస్క్ పొర్స్ పోలీసులు చేసిన ఆపరేషన్ తో ఈ ముఠా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి అనే వ్యక్తి పర్ణిక నానో స్టిస్టమ్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఒక దుకాణం తెరిచాడు. ఈ కంపెనీలో 41మంది నకిలీ ఉద్యోగులను క్రియేట్ చేసాడు. ఉద్యోగుల పేరుపై నకిలీ ఓటర్, పాన్ కార్డుకు సృష్టించాడు. నకిలీ పత్రాలతో రెండు ప్రయివేట్ బ్యాంకులుకు క్రెడిట్ కార్డుల కొరకు ధరఖాస్తు చేశాడు.

ఇతను ధరఖాస్తు చేసిందే ఆలస్యం బ్యాంకు అధికారులు గుడ్డిగా క్రెడిట్ కార్డులను జారీ చేశారు. కార్టులుచేతిలో పడిన వెంటనే డబ్బులు డ్రా చేసుకునేవాడు. ఇలా మొత్తం 125 క్రెడిట్ కార్డులు పొందాడు. ప్రధాన నిందితుడు రంగారెడ్డికి జీహెచ్ఎంసీ ఎలక్షన్ సెల్ లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు బ్యాంక్ వేరిఫికేషన్ సిబ్బంది సహకరించారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. క్రెడిట్ కార్డుల ద్వారా మొత్తం కోటియాబై లక్షలు మోసం చేశారు. నిందితులను నుంచి 6 లక్షల తొంభై వేల రూపాయలు, 19 సెల్ ఫోన్లు, నకిలీ పత్రాలు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. 

అయితే బ్యాంకు అధికారులు, మున్నిపల్ అధికారులతో రంగరెడ్డి ములాఖాత్ అయ్యి నకీలీ పత్రాలను తయారు చేయించాడు. ఈ పత్రాల ఆధారంగా బ్యాంకు క్రెడిట్ కార్డులకు ధరఖాస్తు చేశాడు. అయితే ఎక్కడ కూడా సరియైన వెరిఫికేషన్ లేకపొవడంతో బ్యాంకులు పొటీపడి రంగారెడ్డి కంపెనీలో పనిచేస్తున్నట్లుగా సృష్టించిన వారికి లక్షల రూపాయలకు క్రెడిట్ కార్డులను ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే చివరకు ఈ క్రెడిట్ కార్డుల మోసం వెలుగు చూడడంతో ఇప్పడు బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

నిజమైన ఖాతాదారుడిని ఎన్నో ఇబ్బందులు పెట్టే బ్యాంకు అధికారులు మోసగాళ్లుకు మాత్రం ఎదురుపోయి మరి క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నారని ప్రజలు వాపొతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?