Advertisement

Advertisement


Home > Sports - Cricket

గంగూలీ ఆగయా.. రవిశాస్త్రి పరిస్థితి ఏంటి?

గంగూలీ ఆగయా.. రవిశాస్త్రి పరిస్థితి ఏంటి?

బీసీసీఐకి సూపర్ పవర్ గా ఎంటర్ అవుతున్నారు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. భారత క్రికెట్ జట్టుకు కొత్త నడకలు నేర్పిన కెప్టెన్ గా ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండి పోతారు సౌరవ్ గంగూలీ. సచిన్ తన ఆటతీరుతో క్రికెట్ పై ప్రేమను పెంచితే, గంగూలీ క్రికెట్ కే గ్లామర్ తీసుకొచ్చాడు. తెల్లతోలు క్రికెటర్లతో కూడా దూకుడుగా వ్యవహరించి.. ఆత్మగౌరవాన్ని పెంచిన క్రికెటర్ గా గంగూలీ గుర్తుండిపోతాడు. అలాంటి సౌరవ్ కు ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష హోదా అనేది తగినది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు.

గంగూలీని ఏ కోచ్ గానో, మరే కామెంటరేటర్ గానో చూడటంకంటే.. బీసీసీఐ ప్రెసిడెంట్ చూడటం ఫ్యాన్స్ ను ఆనందపెట్టవచ్చు. ఇలాంటి నేపథ్యంలో గంగూలీ రాగానే తనదైన చర్యలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు. ఇన్నాళ్లూ గంగూలీ విషయంలో అనుచితంగా వ్యవహరించిన వారికి కూడా ఇప్పుడు దడ పట్టుకుని ఉండవచ్చు. గంగూలీతో అనుచితంగా వ్యవహరించే ధైర్యం ఎవరూ చేయలేదు. రవిశాస్త్రి మాత్రమే కొన్ని కటింగులు కొట్టాడు.

ఒక సందర్భంలో గంగూలీని ఉద్దేశించి అసందర్భంగా మాట్లాడాడు శాస్త్రి. గంగూలని ప్రిన్స్ ఆఫ్ బెంగాల్ అని సంబోధించమని ఎవరూ అడగకపోయినా, అలా సంబోధన విషయంలో రవిశాస్త్రి అనుచితంగా వ్యవహరించాడు. అలాగే టీమిండియా కోచ్ ఎంపికలో రవిశాస్త్రి పట్ల గంగూలీ విముఖత చూపించాడు. కొన్నేళ్ల కిందట శాస్త్రిని కాదని, కుంబ్లే ఎంపిక పట్ల గంగూలీ మొగ్గు చూపించాడు. అప్పటి నుంచి పాత కక్షల్లాంటివి అలాగే కొనసాగుతూ ఉన్నాయి.

ఇప్పుడు ఏకంగా బీసీసీఐ సూపర్ పవర్ గా గంగూలీ వస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో రవిశాస్త్రి పరిస్థితి ఏమిటి? అంటూ కొంతమంది ఫ్యాన్స్ సరదా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇప్పటికే రవిశాస్త్రి మీద భారత క్రికెట్ ప్రియుల్లో ఎలాంటి సానుకూలతా లేదు. పొట్ట పెంచేసి, మందు కొడుతూ, అమ్మాయిలతో తిరిగే వ్యక్తి.. హోదా మాత్రం టీమిండియా కోచ్ అనే సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరిన్ని సెటైర్లు పడుతున్నాయిప్పుడు!

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?