Advertisement

Advertisement


Home > Sports - Cricket

అజరుద్ధీన్ టైమ్ ను మార్చేసిన గంగూలీ!

అజరుద్ధీన్ టైమ్ ను మార్చేసిన గంగూలీ!

తన తొలి తొలి అంతర్జాతీయ మ్యాచ్ లను అజరుద్ధీన్ కెప్టెన్సీలోనే ఆడాడు బెంగాళీ దాదా సౌరవ్ గంగూలీ. భారత జట్టు అజరుద్ధీన్ కెప్టెన్సీలో క్లిష్టపరిస్థితుల్లోకి పడిపోయినప్పుడు పగ్గాలు దక్కింది కూడా గంగూలీకే. ఒకవైపు అజర్ మరోవైపు అజయ్ జడేజాలు ఒకే వివాదంలో జట్టులో స్థానం కోల్పోయారు. నిషేధాన్ని ఎదుర్కొన్నారు.

అంత వరకూ వారు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో నిలిచారు. అయితే వివాదం వారిని నిషేధం బారిన పడేసింది.

ఆ తర్వాత ఆ నిషేధాలు తొలగిపోయినా వారినీ బీసీసీఐ పట్టించుకోలేదు. కొంతలో కొంత అజయ్ జడేజా పరిస్థితి బెటర్. జడేజా వ్యాఖ్యాతగా మారాడు. అజర్ ను మాత్రం బీసీసీఐ పట్టించుకోలేదు.

ఎంతగా అంటే.. అతడికి చెల్లించాల్సిన పెన్షన్ ను చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా, బీసీసీఐ ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. భారీ మొత్తమే అజర్ కు అలా అందాల్సి ఉందట. ఇటీవలే అందుకు సంబంధించి బీసీసీఐ క్లియర్ చేసింది. అది సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాకే అనే విషయాన్ని గమనించాలి!

అంతే కాదు.. కోల్ కతాలో డే అండ్ నైట్ టెస్ట్ ప్రారంభం సందర్భంగా అజర్ ను ప్రత్యేకంగా సత్కరించాడు సౌరవ్. మాజీలకు అందే సత్కారాలను అలా అందించాడు. అంతేనా.. తాజాగా ఉప్పల్ స్టేడియంలో ఒక స్టాండ్ కు అజర్ పేరును పెట్టారు. దేశంలోని వివిధ నగరాల్లోని స్టేడియంలలో ఆయా ప్రాంతాల్లోని స్టార్ క్రికెటర్ల పేర్లతో స్టాండ్స్ ఉంటాయి. అజర్ కు ఇన్నేళ్లూ అలాంటి గౌరవాలు లేవు. ఉప్పల్ స్టేడియంలో ఒక స్టాండ్ కు అజర్ పేరు పెట్టారు. దాన్ని లక్ష్మణ్ ఆవిష్కరించారు.

ఇలా ఇన్నేళ్లూ అజర్ కు పెండింగ్ లో ఉన్న గౌరవాలు, సత్కారాలు అన్నీ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాకా దక్కుతున్నాయి. ప్రస్తుతం అజర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. మొత్తానికి ఈ మాజీ దాదాపు గత ఇరవై యేళ్ల నుంచి ఎదుర్కొంటున్న అన్ని నిషేధాజ్ఞాలనూ  జయించినట్టుగా ఉన్నాడు. అందులో కోర్టు తీర్పులతో పాటు గంగూలీ ఆదరణే ఎక్కువగా కనిపిస్తూ ఉంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?