Advertisement

Advertisement


Home > Sports - Cricket

కొహ్లీ.. కొత్త కొత్త రికార్డుల దిశ‌గా!

కొహ్లీ.. కొత్త కొత్త రికార్డుల దిశ‌గా!

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ బ్యాట్ నుంచి ప‌రుగులు జాలువారుతూ ఉన్నాయి. కొహ్లీ క్రికెట్ లో కొత్త కొత్త రికార్డుల దిశ‌గా సాగుతూ ఉన్నాడు. ఇప్ప‌టికే కొహ్లీ త‌న సూప‌ర్ బ్యాటింగ్ తో వివిధ రికార్డుల ద్వారా దిగ్గ‌జాల స‌ర‌స‌న నిలుస్తూ ఉన్నాడు. 

స‌చిన్, పాంటింగ్, క‌లిస్.. వంటి వారి రికార్డులు అనిత‌ర సాధ్యం అని అంతా అనుకున్నారు. అయితే వాట‌న్నింటినీ చేధించే దిశ‌గా సాగుతున్నాడు కొహ్లీ. ఆస్ట్రేలియాతో వ‌న్డే సీరిస్ లో ఆఖ‌రి,మూడో వ‌న్డేలో కొహ్లీ ప‌లు రికార్డుల‌ను సాధించాడు. నిన్న‌టి మ్యాచ్ లో అత‌డు సెంచ‌రీని పూర్తి చేయ‌లేక‌పోయినా.. హాఫ్ సెంచ‌రీతో సెంచ‌రీ కొట్టాడు. కెరీర్ లో వందో హాఫ్ సెంచ‌రీని పూర్తి చేశాడు కొహ్లీ. 

ఇంత వ‌ర‌కూ వంద కు పైగా హాఫ్ సెంచ‌రీలు బాదిన క్రికెట‌ర్లు న‌లుగురే ఉన్నారు. ఐదో బ్యాట్స్ మ‌న్ గా కొహ్లీ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. క‌లిస్ 103 హాఫ్ సెంచ‌రీల‌తో, పాంటింగ్ 112, సంగాక్క‌ర 118, స‌చిన్ 145 హాఫ్ సెంచ‌రీల‌తో కొహ్లీ క‌న్నా ముందున్నారు. కెరీర్ ప‌రంగా చూస్తే.. కొహ్లీ స‌చిన్ స్థాయిలో హాఫ్ సెంచ‌రీల‌ను చేసినా పెద్ద‌గా ఆశ్చ‌ర్యం లేదు. 

కేవ‌లం త‌న 236 వ‌న్డేత‌నే కొహ్లీ వంద హాఫ్ సెంచ‌రీల‌ను పూర్తి చేశాడు. మిగ‌తా దిగ్గ‌జాలంతా కొహ్లీ కన్నా వంద‌కు పైగా వ‌న్డేలు ఎక్కువ ఆడిన త‌ర్వాతే ఈ రికార్డుకు చేరువ‌య్యారు. అలా చూస్తే.. కొహ్లీ వారి క‌న్నా ఎంత దూకుడుగా ఆడుతున్న‌ట్టో అర్థం చేసుకోవ‌చ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?