Advertisement


Home > Movies - Movie News
ఆల్ ది బెస్ట్.. కానీ పోటీ తప్పదు

"అఖిల్ హలో సినిమా పెద్ద హిట్ అవ్వాలి. సాంగ్స్, ట్రయిలర్ చూశాను. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చాలా ప్రామిసింగ్ గా ఉంది. అఖిల్ డాన్స్ చాలా బాగా చేశాడు. ఆల్ ది బెస్ట్ అఖిల్." ఈ మాటలు అంటోంది ఎవరో కాదు, నిర్మాత దిల్ రాజు. హలో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూనే దానికి పోటీగా ఎంసీఏ సినిమాను తీసుకొస్తున్నామని ప్రకటించాడు దిల్ రాజు. 

"డిసెంబర్ 21న వస్తామని ఆగస్ట్ లోనే చెప్పాం.. ఈనెల 15కే రావడానికి ట్రై చేశాం. కానీ డేట్స్ కుదరలేదు.. ముందు అనుకున్నట్టుగానే డిసెంబర్ 21కు వస్తున్నాం. డిసెంబర్ లో రావడానికి మెయిన్ రీజన్ ఒకటే. శతమానంభవతి, నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్.. ఇలా ఈ ఏడాది 5హిట్స్ వచ్చాయి. ఆరో సినిమా ఎంసీఏతో కూడా హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో డిసెంబర్ లో వస్తున్నాం. హలోకు పోటీగా మాత్రం కాదు." 

ఎంసీఏ రిలీజ్ పై దిల్ రాజు వెర్షన్ ఇది. పోటీ విషయంలో నాగ్ చెప్పిన మాటల్నే దిల్ రాజు కూడా రిపీట్ చేశాడు. సంక్రాంతికొచ్చిన ఖైదీ నంబర్ 150, శతమానంభవతి, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు ఎలా హిట్ అయ్యాయో.. ఈ డిసెంబర్ లో కూడా హలో, ఎంసీఏ సినిమాలు అలానే హిట్ అవుతాయంటున్నాడు.  మొత్తమ్మీద ఎంసీఏ, హలో సినిమాలు రెండూ 24గంటల తేడాతో థియేటర్లలోకి రావడం ఖాయమని తేలిపోయింది.