Home > Movies - Movie News
అఖిల్ కోసం నాని వెనక్కి?

అఖిల్-విక్రమ్ కుమార్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. డిసెంబర్ 22న డేట్ గా పెట్టుకున్నారు. ఇదే సమయంలో దిల్ రాజు హీరో నానితో నిర్మిస్తున్న ఎమ్ సి ఎ విడుదల కూడా ప్లానింగ్ లో వుంది. అయితే ఇంకా పక్కా అయితే ఫిక్స్ కాలేదు. నానికి ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ వుంది. అదే సమయంలో అఖిల్ సినిమా హలో డైరక్టర్ విక్రమ్ కుమార్ అన్నా ఓవర్ సీస్ మార్కెట్ లో మంచి ఒపీనియన్ వుంది. అందువల్ల రెండు సినిమాలు రెవెన్యూ ను షేర్ చేసుకోవాల్సి వుంటుంది. 

అదీ కాక, ఈ సీజన్ లోనే హాలీవుడ్ లో మంచి భారీ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయని వినికిడి. అందువల్ల థియేటర్ల సమస్య కూడా వస్తుందని తెలుస్తోంది. 

అందువల్ల రెండు తెలుగు సినిమాల్లో ఎవరో ఒకరు వెనక్కు వెళ్లక తప్పదు. అఖిల్ సినిమా హలో డేట్ ముందే ప్రకటించేసారు కాబట్టి వెనక్కు వెళ్లడం కష్టం కావచ్చు. దిల్ రాజుకు అలాంటి శషభిషలు ఏమీ వుండవు. సినిమాకు మంచి డేట్ చూసుకుంటారు తప్ప, ముందుకు వెళ్లడం, వెనక్క వెళ్లడంలో ప్రెస్టీజ్ లకు పోరు. అందువల్ల ఎమ్ సి ఎ ఓ వారం వెనక్కో, ముందుకో వెళ్లుతుందనే అనుకోవాలి.