Advertisement


Home > Movies - Movie News
అఖిల్‌ మూవీ ఓ రేంజ్‌లో.!

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని అఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోన్న విషయం విదితమే. తొలిసారిగా హైద్రాబాద్‌ మెట్రో రైల్‌లో అఖిల్‌ సినిమా కోసం కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరిస్తున్నారు. అఖిల్‌ తనకిష్టమైన స్టంట్‌ మ్యాన్‌తో యాక్షన్‌ సన్నివేశాలు చేస్తున్నానంటూ ఆ ఆనందాన్ని సోషల్‌ మీడియాలో ఇదివరకే పంచుకున్నాడు. బాబ్‌ బ్రౌన్‌ అనే హాలీవుడ్‌ స్టంట్‌ మ్యాన్‌ ఈ చిత్రానికి పనిచేస్తున్న విషయం విదితమే. 

ఇక, తాజాగా మరో విదేశీ సాంకేతిక నిపుణుడి పనితనం గురించి సోషల్‌ మీడియాలో వెల్లడించాడు అఖిల్‌. బల్గేరియాకి చెందిన నిక్కీతో ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాల్ని కెమెరాలో బంధిస్తున్నారు. బాడీ వోర్న్‌ కెమెరాతో (స్టడీ క్యామ్‌) అత్యద్భుతంగా సన్నివేశాల్ని తెరకెక్కించేస్తున్నాడట నిక్కీ. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా ఈ సినిమా కోసం పనిచేస్తోంది విక్రమ్‌ కుమార్‌ టీమ్‌. 

తొలి సినిమా 'అఖిల్‌' తీవ్రంగా నిరాశపర్చడంతో, అఖిల్‌ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మరోపక్క, సినిమా విశేషాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు అఖిల్‌. సోషల్‌ మీడియాలో అఖిల్‌ ఇంత యాక్టివ్‌గా వుండడంతో అక్కినేని అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోతోంది.