Advertisement


Home > Movies - Movie News
సెక్సీయెస్ట్‌.. హ్యాపీయెస్ట్‌ ప్రియాంకా చోప్రా

ఆసియాలోనే సెక్సీయెస్ట్‌ మహిళగా బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా 'టైటిల్‌' గెల్చుకుంది. మొదటిసారి కాదిది ఆమెకి ఈ టైటిల్‌ దక్కడం. ఇప్పటికి నాలుగుసార్లు ఈ టైటిల్‌ని అందుకున్న ప్రియాంకా చోప్రా, మరోమారు.. అంటే, ఐదోసారి సెక్సీయెస్ట్‌ విమెన్‌ (ఆసియా) కేటగిరీలో ఫస్ట్‌ ప్లేస్‌ దక్కించుకుంది. 

ఇంకేముంది, సోషల్‌ మీడియాలో ప్రియాంకా చోప్రాకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తనకు లభించిన ఈ అరుదైన గుర్తింపుతో ఉబ్బితబ్బిబ్బవుతోంది ప్రియాంకా చోప్రా. తనను ఇంత అందంగా, ఇంత సెక్సీగా పుట్టించిన తల్లిదండ్రులకు ప్రియాంక థ్యాంక్స్‌ చెప్పింది. 'అభిమానులు లేకపోతే నేను లేను.. ఈ స్థాయిలో నేను గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం మీరే.. నా బలం మీరే..' అంటూ అభిమానులకీ ఓ థ్యాంక్స్‌ పడేసింది ప్రియాంక. 

అభినందనలు మాత్రమే కాదండోయ్‌, 'ట్రాలింగ్‌' కూడా తప్పడంలేదు ప్రియాంకా చోప్రాకి. బాలీవుడ్‌ 'గీత' దాటేసి, హాలీవుడ్‌కి వెళ్ళిన ప్రియాంక, ఆ హాలీవుడ్‌ 'గీత' కూడా దాటేస్తే.. మరింత 'సెక్సీయెస్ట్‌' గుర్తింపు రావడం ఖాయమని సోషల్‌ మీడియాలో ఆమె హేటర్స్‌ కామెంట్స్‌ షురూ చేసేశారు. హాలీవుడ్‌ 'గీత' అంటే న్యూడిటీ అట. 

అయితే, ప్రియాంక మాత్రం అలాంటి నాన్సెన్స్‌ని తాను పట్టించుకోబోననీ, సెక్స్‌ సింబల్‌ అన్పించుకోవడమంటే అంత ఆషామాషీ కాదనీ, ఒకప్పుడు బాలీవుడ్‌లోనూ 'సెక్సీ ఇమేజ్‌'ని ఇబ్బందికరంగా భావించేవారనీ, ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పుకొచ్చింది. అన్నట్టు, ప్రియాంక తర్వాతి ప్లేస్‌లో.. అంటే, రెండో ప్లేస్‌లో సెక్సీయెస్ట్‌ విమెన్‌గా నియా శర్మ నిలిచింది. మూడో ప్లేస్‌ దీపికా పడుకొనేకి దక్కింది.