Home > Movies - Press Releases
21న వైశాఖం

బి జయ డైరక్షన్ లో హరీష్-అవంతిక హీరో హీరోయిన్లుగా నిర్మాత బిఎ రాజు నిర్మించిన వైశాఖం సినిమా అమ్మకాలు షురూ అయ్యాయి. సాయి చందన ఫిలింస్ (కడప) సీడెడ్ ను 72 లక్షలకు, వైజాగ్ ను 54 లక్షలకు కొనుగోలు చేయడంతో అమ్మాకాలు షురూ అయ్యాయి. నైజాం డీల్ కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్య ఫైనల్ స్టేజ్ లో వుంది. దీంతో కొన్న బయ్యర్ల కోరిక మేరకు వైశాఖం సినిమాను ఈనెల 21న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

వాస్తవానికి సీడెడ్ కొందామని వచ్చిన బయ్యర్ పాటలు, సినిమాలోని కొన్ని సీన్లు, చూసి విశాఖ కూడా కొనడం విశేషం. డిజె వసంత్ సంగీతంలో విడుదలైన పాటలు ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. 'భానుమతి.. భానుమతి', 'కమాన్‌ కంట్రీ చిలకా..', 'ప్రార్థిస్తానే..', వైశాఖం టైటిల్‌ సాంగ్‌..లకు మంచి అప్లాజ్ వచ్చింది.

సినిమాను ఈనెల 14న విడుదల చేద్దామనుకున్నారు కానీ, ప్రచారానికి మరి కాస్త సమయం వుంటుందని, 21 అయితే బాగుంటుందని,థియేటర్లు తీసుకోవడం కూడా సులువు అవుతుందని బయ్యర్లు కోరడంతో, ఆ మేరకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వైశాఖం సినిమా సుమారు 7 కోట్ల బడ్జెట్ తో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తయారయింది.