Home > Movies - Press Releases
బాబు బాగా బిజీ వాయిదా

అవసరాల శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ బాబు బాగా బిజీ. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కావాల్సి వుంది. కానీ ఇప్పుడు ఈ సినిమా మే 5 కు వాయిదా పడింది. హిందీ సినిమా హంటర్ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సెక్స్ విషయంలో కాస్త ఓవర్ డోస్ నే వుంటుందీ సినిమాలో.  చాలా మినిమమ్ గ్యారంటీ బడ్జెట్ లో తయారైన ఈ సినిమా వన్ వీక్ ఆడితే చాలు, సేఫ్ అయిపోతుంది. అయితే సెన్సారు కు ఇంకా డేట్ రాకపోవడం, బాహుబలి ముందు రెండు వారాలు టైమ్ మాత్రమే వుండడం, తదితర కారణాలతో వెనక్కు వెళ్లిపోయి, మే అయిదున రావాలని ఫిక్సయ్యారు. దీంతో 14న రేస్ లోంచి ఓ సినిమా తప్పుకున్నట్లయింది. ఇక వరుణ్ తేజ మిస్టర్, లారెన్స్ శివగంగ మిగిలాయి.