Home > Movies - Press Releases
బాలకృష్ణుడికి జగపతి వాయిస్

ఈమధ్య సినిమాలకు సెలబ్రిటీల వాయిస్ ఓవర్ అన్నది ఓ ప్లస్ పాయింట్ గా మారింది. లేటెస్ట్ గా నారా రోహిత్ మాస్ హీరోగా నటిస్తున్న బాలకృష్ణుడు సినిమాకు నిన్నటి తరం హీరో, ఈతరం క్యారెక్టర్ ఏక్టర్ జగపతిబాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్న నారా రోహిత్ తొలిసారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ హీరో క్యారెక్టర్ చేస్తున్నారు. పైగా ఈ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో నడుస్తుంది. రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించే ఈ సినిమా ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో అల్లుకున్న కథతో తయారవుతోంది.

మాయాబజార్ మూవీ స్ పతాకంపై మహేంద్ర, వంశీ, వినోద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పవన్ మల్లెల దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాతో కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు నారా రోహిత్. సిక్స్ ప్యాక్ చేసారు. వీలయినంత ఫిజిక్ ను తగ్గించారు. అంతే కాదు అటు ఫన్ ఇటు యాక్షన్ ఇలా అన్నీ పక్కా పాళ్లు కలిసిన కమర్షియల్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 24న ఈ సినిమా విడుదలవుతోంది.