Home > Movies - Press Releases
దసరా బరిలో నెక్స్ట్ నువ్వే

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి (ఈటీవీ ప్రభాకర్) ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో బ‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం నెక్స్ట్ నువ్వే. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది ఈ చిత్రానికి క‌థ‌కి స‌రిపోయె విధంగా నెక్ట్ నువ్వే అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.  హీలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైభ‌వి, ర‌ష్మి లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ చిత్రాన్నిఅన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత బ‌న్నివాసు స‌న్నాహ‌లు చేస్తున్నారు. 

అన్నీ కాన్సెప్ట్ మూవీలే

నిర్మాత బన్నీ వాసు అన్నీ కాన్సెప్ట్ చిత్రాలనే ఎంచుకుంటూ వస్తున్నారు. ఇద్దరు తెలివైన స్టూడెంట్స్ ఇగో క్లాష్ లే కాన్సెప్ట్ గా 100%లవ్ సినిమా తీసారు. మారుతి ద‌ర్శ‌కుడిగా అల్లు శిరీష్ హీరోగా తన స్వార్థమే తనది అనుకునే హీరో క్యారెక్టర్ కాన్సెప్ట్ తో కొత్త‌జంట చిత్రాన్ని నిర్మించారు.  ఆ త‌రువాత వ‌చ్చిన నాని హీరోగా మారుతి ద‌ర్శ‌కుడిగా మతిమరుపు హీరో అన్నది కాన్సెప్ట్ గా తీసుకుని భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం నిర్మించారు.   ఇప్ప‌డు నెక్ట్స్ నువ్వే అనే హిలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ తో విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. 

రెండు పెద్ద నిర్మాణ సంస్థలు యు వి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్  కలిసి ప్రారంభించిన  వి4 మూవీస్ లో ఈ చిత్రాన్ని బ‌న్నివాసు నిర్మిస్తుండగా, టీవీ తెరపై పేరు తెచ్చుకున్న నటుడు,  ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ తొలిసారి పెద్ద తెరపై సినిమా చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రానికి నెక్ట్స్ నువ్వే అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము.  ఆదిసాయికుమార్ కెరీర్ లో ఇది మంచి విజ‌యం గా నిలుస్తుంది.  విజ‌య ద‌శ‌మి సంద‌ర్బంగా సినిమాను విడుదల చేస్తున్నామని అన్నారు.