Advertisement


Home > Movies - Press Releases
ధీమానా? పబ్లిసిటీనా?

జస్ట్ కోటిన్నర ఖర్చు. పెద్దగా స్టార్ కాస్ట్ లేదు. కానీ ట్రయిలర్ కు మాంచి బజ్ వచ్చింది. మాంచి థ్రిల్లర్ అనే ఫీల్ కలిగించింది. ఆ సినిమానే వెంకటాపురం. ఈ సినిమాను ఈనెల 29 న బాహుబలి 2 వచ్చిన రెండు రోజులకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది నిజమేనా? లేక అలా ప్రకటిస్తే, ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాహుల్ హీరోగా తయారైన ఈ సినిమాలో చాలా చమక్కులే వున్నాయట. కుర్రాడు చాన్నాళ్ల తరువాత హీరోగా చేయడమే కాకుండా, సినిమా సెకండాఫ్ లో చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ కూడా చూపించేసాడట. మరి ఇన్నీ చేసి, కాస్త మంచి టైమ్ చూసి వదులుకోకుండా, బాహుబలి 2 మీదకు రావడం ఏమిటొ? హెవీ రిటర్న్ లు వుంటాయి కదా, వాటితో నన్నా ఈ థియేటర్లు ఫుల్ అవుతాయనా? వెయ్యి థియేటర్ల సినిమా అది అందులో అయిదో వంతు 200 థియేటర్ల సినిమా ఇది.

ఎవరి సినిమా మీద వాళ్లకు ఎంత ధీమా వున్నా, ఇంత రిస్క్ ఎందుకో? దగ్గరకు వచ్చాక, తూచ్..వాయిదా అంటారో? ధైర్యే సాహసే సినిమా అంటారో చూడాలి మరి.