Advertisement


Home > Movies - Press Releases
గల్ఫ్-ముఫై నెలలు..కోట్ల ఖర్చు

చిన్న సినిమాను చిన్న సినిమాలా తీయాలి. కానీ అలా కాకుండా కాస్త సాహసమే చేస్తున్నారు డైరక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. గల్ఫ్ లో వుండే తెలుగు వాళ్ల సమస్యలపై సినిమాను తీయడానికి బాగానే ఖర్చు చేసేసారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికే ముఫై నెలలు టైమ్ పట్టింది. గల్ఫ్ వెళ్లి, అక్కడి తెలుగు వాళ్లతో, తెలుగు అసోసియేషన్లతో మాట్లాడి, అక్కడి క్యాంప్ లను సందర్శించి, స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. 

సామాజిక నేపధ్యoలో సినిమాలు తీసే సునీల్ కుమార్ రెడ్డి సొంతవూరు,గంగ పుత్రులతో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అవి స్మాల్ బడ్జెట్ సినిమాలు. అయితే ఈసారి మాత్రం కాస్త ఎక్కువే ఖర్చయింది. కారణం విదేశీ లోకేషన్, ఎక్కువ టైమ్ తీసుకోవడం.    గల్ఫ్ లో ఎక్కువ పార్ట్ చిత్రీకరణ జరుపుకొవడం, ఎక్కువ రోజుల షూటింగ్, సీనియర్ ఆర్టిస్టులను పెట్టడంతో బడ్జట్ అదుపు తప్పినట్టు కనిపిస్తుంది.

అయితే 25 లక్షల మంది తెలుగువాళ్ళు గల్ఫ్ లో పని చెయ్యడం వారి మీద ఆధారపడి మరో కోటి మంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వుడడంతో వాళ్ళoదరికీ ఈ సబ్జెక్ట్ బాగా కనెక్ట్ అవుతుందని, అందువల్ల కమర్షియల్ గా కూడా సక్సెస్ అవుతుందని సునీల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఆదీ కాక యూత్ రొమాన్సు కాస్తు బాగానే పిక్చరైజ్ చేసినట్లు చెబుతున్నారు. 

ఈ శుక్రవారం విడుదలుతున్న ఈ సినిమాతో సీనియర్ సినీ జర్నిలిస్ట్ పులగం చిన్నారాయణ మాటల రచయితగా మారుతున్నారు. ఇంతకు ముందు పైసా వసూల్ సినిమాతో పాటల రచయితగా మారిన పులగం ఈ సినిమాతో మాటల రచయితగా మారారు. 

ఇదిలా వుంటే ఈ సినిమాలో ఓ అరబిక్ పాటను కూడా చేర్చారు. సినిమా గల్ఫ్ నేపథ్యంలో జరగడంతో అరబిక్ పాటను అక్కడి రచయిత చేతే రాయించి చిత్రీకరించారు. చేతన్, డింపుల్ జంటగా నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ వి శివరామ్ సినిమాటోగ్రఫీ, కాసర్ల శ్యామ్ పాటలు, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం సునీల్ కుమార్ రెడ్డి. నిర్మాతలు రవీంద్రబాబు, రమణికుమారి.