Home > Movies - Press Releases
కుర్రాడు కొత్తగా ట్రయ్ చేస్తున్నాడు

హ్యాపీడేస్ సినిమా చాలా మంది లిఫ్ట్ ఇచ్చినా, టైసన్ (రాహుల్) కు మాత్రం ఇంకా సరైన బ్రేక్ రాలేదు. అందుకే శ్రేయా మీడియాతో కలిసి ఓ డిఫరెంట్ ప్రయత్నం చేస్తున్నాడు. స్వామిరారా, రౌడీ ఫెలో వంటి సినిమాలకు అసోసియేట్ గా పనిచేసిన వేణును డైరక్టర్ గా పరిచయం చేస్తూ శ్రేయా మీడియా 'వెంకటాపురం' అనే వైవిధ్యమైన సినిమాను చాలా సైలెంట్ గా నిర్మించేసింది. 

ఈ సినిమాలో రాహుల్ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. జస్ట్ నిన్ననే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ విషయం చెప్పకనే చెప్పింది. సోషల్ నెట్ వర్క్ లో ఈ పోస్టర్ కు మంచి అప్లాజ్ వచ్చింది. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించే ఈ సినిమాకు, అచ్చు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో తనకు బ్రేక్ వస్తుందని రాహుల్ ఆశగా వున్నాడు మరి.