Advertisement


Home > Movies - Press Releases
నక్షత్రం కోసం చాలా కష్టపడ్డా-సందీప్ కిషన్

సందీప్ కిషన్. బ్రేక్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతూ వస్తున్నాడు సందీప్ కిషన్. ఇప్పుడు మంచి సినిమా చేతిలోకి వచ్చింది. కృష్ణవంశీ డైరక్షన్ లో ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ హీరోగా చేస్తున్నాడు నక్షత్రం సినిమాలో. 

ఈ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. పైగా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని, చెప్పాడు సందీప్. అవన్నీ అతని మాటల్లోనే.

* దాదాపు 120 రోజులు పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది.

* దాదాపు 115 రోజులకి పైగా ఈ షూటింగ్ లో నేను పాల్గోన్నాను..

* షూటింగ్ ఉన్న ప్రతి రోజు, కృష్ణవంశీ నాచేత ఓ రెండు కిలోమిటర్లు ఎండలో రౌండ్లు కొట్టించారు

* ఇదంతా రామరావు పాత్రలో సందీప్ కిషన్ న్యాచురల్ కనిపించడం కోసం చేయడం జరిగేది.

* షూటింగ్ లో ప్రతిరోజు ఏదో ఒక చిన్న గాయం తప్పేది కాదు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఎలాంటి డూప్ లేకుండా చేసాను.

* చూసిన ప్రతి పోలీస్ గర్వపడేలా వుంటుందీ సినిమా.

* ప్రస్థానం తరువాత ఇంత ఎమోషనల్ సీన్స్ మళ్లీ ఈ సినిమాలోనే చేసాను.

ఈ సినిమాతో కచ్చితంగా బ్రేక్ వస్తుంది. ప్రేక్షకులు కచ్చితంగా నా నటన గుర్తిస్తారన్న నమ్మకం వుంది...అన్నారు సందీప్ కిషన్