Advertisement


Home > Movies - Press Releases
అక్టోబర్ మూడోవారంలో హే..పిల్లగాడ

`ఓకే.. బంగారం` సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా `క‌లి`. ఈ సినిమాను సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ) స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిలింస్ ప‌తాకంపై `హేయ్‌.. పిల్ల‌గాడ` అనే పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. డి.వి.కృష్ణ‌స్వామి నిర్మాత‌. స‌మీర్ తాహిర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. అక్టోబ‌ర్ మూడో వారంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా.... నిర్మాత డి.వి.కృష్ణ‌స్వామి మాట్లాడుతూ - ` దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఫిదా సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం `క‌లి`. మ‌ల‌యాళం,త‌మిళంలో సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులో విడుద‌ల `హేయ్‌..పిల్ల‌గాడ‌` పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నాం. ఇదొక టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీ. దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ పొందింది. గోపీసుంద‌ర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, గిరీష్ గంగాధ‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి.  సినిమాను ఈ అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.