Home > Movies - Press Releases
పూరి ఆవిష్క‌రించిన‌ పోస్టర్

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో .. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులుగా బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై  నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. ఫిబ్ర‌వ‌రిలో ఆడియో, మార్చిలో సినిమా రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నారు.

క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు. `ఓ పిల్లా నీ వ‌ల్లా` పోస్ట‌ర్ క్యూరియ‌స్‌గా ఉంద‌ని పూరి ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ``ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని ల‌వ్‌, కామెడీ -యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. మ‌ధు పొన్నాస్ సంగీతం, షోయ‌బ్ అహ్మ‌ద్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అస్సెట్ అవుతాయి. ఫిబ్ర‌వ‌రి ఆడియో విడుద‌ల చేసి, మార్చిలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. పూరి చేతుల‌మీదుగా మోష‌న్‌పోస్ట‌ర్‌ లాంచ్ చేయ‌డం, ఆయ‌న ప్ర‌శంసించ‌డం.. సంతోషాన్నిచ్చింది. పూరి స‌ర్‌కి ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్ త‌దిత‌రులు ఈ చిత్రంలో నటించారు.