Home > Movies - Press Releases
`రోగ్‌` చిత్రాన్ని ఆదరించిన ఆడియెన్స్‌కు థాంక్స్

పూరిజగన్నాధ్‌ దర్శకత్వంలో తాన్వి ఫిలింస్‌ పతాకంపై జయాదిత్య సమర్పణలో ఇషాన్‌ని హీరోగా సి.ఆర్‌. మనోహర్‌, సి.ఆర్‌. గోపి నిర్మించిన చిత్రం 'రోగ్‌'. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సక్సెస్ మీట్ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌, హీరో ఇషాన్‌, హీరోయిన్‌ మన్నారాచోప్రా, సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌, కెమెరామెన్‌ ముఖేష్‌, ఎడిటర్‌ జునైద్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ జానీ షేక్‌, కొరియోగ్రాఫర్‌ యాని పాల్గొన్నారు. 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాధ్‌ మాట్లాడుతూ - ''రోగ్‌' రిలీజ్‌ అయి మంచి ఓపెనింగ్స్‌ని సాధించింది. తెలుగు, కన్నడంలో చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రివ్యూన్‌ అన్నీ చాలా పాజిటివ్‌గా రాసి మా సినిమాని ఎంకరేజ్‌ చేస్తున్నందుకు అందరికీ నా ధాంక్స్‌. మా టీమ్‌ అంతా కొన్ని ధియేటర్లకి వెళ్లి ఆడియన్స్‌ మధ్యలో సినిమా చూశాం. ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూసి చాలా ఎంజాయ్‌ చేశాం. ఇషాన్‌కి చాలా మంచి పేరు వచ్చింది. 2, 3 సినిమాలు చేసిన హీరోకి ఎంత పేరు వస్తుందో ఇషాన్‌ ఫస్ట్‌ సినిమాకే అంత పేరు కొట్టేశాడు. విలన్‌గా నటించిన అనూప్‌సింగ్‌ క్యారెక్టర్‌కి టెరిఫిక్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజుకి కూడా ఆల్‌మోస్ట్‌ అన్ని ధియేటర్లు 90 శాతం ఫుల్స్‌ అయ్యాయి.  ఈ సినిమాని ఆదరించి పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులందరికీ నా థాంక్స్‌'' అన్నారు. 

యంగ్‌ ఛార్మింగ్‌ హీరో ఇషాన్‌ మాట్లాడుతూ - ''నా మీద నమ్మకంతో నన్ను నమ్మి మనోహర్‌, గోపి అన్నయ్యలు యాక్టింగ్‌ కోర్సు నేర్పించారు. అలాగే నా స్టిల్స్‌ చూసి ఇమీడియట్‌గా హీరో క్వాలిటీస్‌ అన్నీ వున్నాయి అని నమ్మి ఎంతో డేర్‌గా పూరి గారు నన్ను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ మంచి సినిమా తీశారు. నాలాంటి కొత్త వారందరికీ ఈ సినిమాలో అవకాశం ఇచ్చి ఎంకరేజ్‌ చేసిన నా గాడ్‌ఫాదర్‌ పూరిగారికి నా థాంక్స్‌. ఇలాగే అందరి సపోర్ట్‌ వుండాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 

హీరోయిన్‌ మన్నారాచోప్రా మాట్లాడుతూ - ''అంజలి క్యారెక్టర్‌కి మంచి అప్రీషియేషన్‌ వస్తోంది. ఇంత మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన నా గాడ్‌ఫాదర్‌ పూరి గారికి నా థాంక్స్‌. 

సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ మాట్లాడుతూ - ''పూరిజగన్నాధ్‌గారు ఎన్నో సలహాలు ఇచ్చి మంచి ట్యూన్స్‌ చేయించుకున్నారు. విజువల్‌గా సాంగ్స్‌ అన్నీ బాగా వచ్చాయి. స్పెషల్‌గా రీ రికార్డింగ్‌ చాలా బాగా కుదిరింది. నన్ను ఎంకరేజ్‌ చేస్తూ అవకాశం ఇచ్చిన పూరి సార్‌కి నా థాంక్స్‌'' అన్నారు. 

కళా దర్శకుడు జానీ మాట్లాడుతూ - ''మా టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకోవడానికి పూరి జగన్నాధ్‌ గారు ఈ సినిమాతో అవకాశం కల్పించారు. ఆయనకి నా కృతజ్ఞతలు'' అన్నారు. కెమెరామెన్‌ ముఖేష్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా రిలీజ్‌ అప్పుడు నేను అబ్రాడ్‌లో ఉన్నాను.  ఫొటోగ్రఫి చాలా బాగుందని టాక్ రావడం విని చాలా ధ్రిల్‌గా ఫీలయ్యాను. ఈ క్రెడిట్‌ అంతా పూరిగారికే చెందుతుంది. నా మీద నమ్మకంతో మంచి అవకాశం కల్పించారు. నా టాలెంట్‌ని ఈ సినిమాతో ప్రూవ్‌ చేసుకున్నాను'' అన్నారు. 

ఎడిటర్‌ జునైద్‌ ,కొరియోగ్రాఫర్‌ యాని తదితరులు పాల్గొన్నారు.