Advertisement


Home > Movies - Press Releases
సప్తగిరి ఎక్స్ ప్రెస్ 50 రోజుల వేడుక

సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్‌ హీరో హీరోయిన్లుగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్‌ నిర్మాతగా రూపొందిన చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌`. డిసెంబ‌ర్ 23న ఈ సినిమా విడుద‌లై 50 రోజుల‌ను పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా 50రోజుల వేడుక‌ను హైద‌రాబాద్‌లో నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ మాట్లాడుతూ - `కొత్త సినిమాలు వ‌స్తుండాలి..స‌క్సెస్ అవుతుంటేనే అప్పుడే ఇండ‌స్ట్రీ బావుంటుంది. తెలంగాణ‌లో చిత్ర ప‌రిశ్రమ‌కు ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌గారు ఎంతో అండ‌గా ఉన్నారు. చిన్న చిత్రాలకు ప్రభుత్వం త‌మ వంతు స‌హ‌కారాన్ని అందిస్తుంది. మల్టీప్లెక్స్‌ల్లో ఐదో ఆట‌ను వేయ‌మ‌ని జి.వో కూడా ఇవ్వడం జ‌రిగింది. అలాగే ఆన్ టికెట్స్ విధానానికి మ‌ద్ధతు ఇస్తున్నాం. 

అందుకోసం ప్రభుత్వమే సైట్స్‌ను పెట్టి టికెట్స్‌ను విక్రయించేలా ప్లాన్ చేస్తున్నాం. మంచి సందేశాత్మక చిత్రాల‌తో పాటు చారిత్రాత్మ‌క చిత్రాలైన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, రుద్రమ‌దేవి వంటి చిత్రాల‌కు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చాం. ప్రతి ఏడాది ఉగాది పండుగ‌కు ఇచ్చే నంది అవార్డుల‌ను ఈసారి ద‌స‌రా పండుగ‌కు ఇచ్చేలా ప్ర‌ణాళిక రూపొందిస్తున్నాం. స‌ప్తగిరి ఎక్స్‌ప్రెస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని చేసిన ద‌ర్శక నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు` అన్నారు.

స‌ప్తగిరి మాట్లాడుతూ - ``చిన్న సినిమాగా అనుకుని స్టార్ట్ చేస్తే చాలా పెద్ద సినిమా అయ్యింది. మాస్ ఆడియెన్స్ సినిమాను పెద్ద హిట్ చేశారు. ర‌వికిర‌ణ్‌గారి వంటి మంచి మిత్రుడు నిర్మాత‌గా మారడంతో సినిమాను ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. మిత్రుడు ష‌క‌ల‌క శంకర్ ఎంతో స‌హ‌కారం అందించారు. ఇలాగే మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌నుకుంటున్నాను`` అన్నారు.

ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ - చిన్న సినిమాగా విడుద‌లైన ఈ సినిమా కోసం భారీగా ఖ‌ర్చు పెట్టి మంచి క్వాలిటీతో సినిమా చేశాం. విడుద‌లైన సినిమా ప్రేక్షకుల‌కు బాగా న‌చ్చడంతో సినిమా చాలా పెద్ద స‌క్సెస్ అయ్యింది. మ‌ళ్ళీ స‌ప్తగిరితో క‌లిసి మా బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్నాం. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఘనవిజయం సాధించిన సందర్భంగా సాయి సెల్యులాయిడ్ బ్యానర్ తరుపు నుంచి చిత్ర హీరోకి కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు నిర్మాత డాక్టర్ రవికిరణ్.

మంత్రి జోగురామ‌న్న మాట్లాడుతూ - ``ఆదిలాబాద్ జిల్లా నుండి వ‌చ్చిన రవికిర‌ణ్‌గారు నిర్మాత‌గా రాణించ‌డం ఆనందంగా ఉంది. ఇలాంటి విజ‌య‌వంత‌మైన సినిమాలు మ‌రిన్ని చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.