Advertisement


Home > Movies - Press Releases
వైశాఖంలో 'వైశాఖం'

లేడీ డైరక్టర్ బి జయ డైరక్షన్ లో ముస్తాబవుతున్న సినిమా వైశాఖం. మండు టెండలు, ముంజెకాయలు, మామిడి పళ్లు, మల్లెపూలు, పెళ్లిళ్లు, తాటిపందెళ్లు, ఇలా అన్ని విధాలా ప్రత్యేకమే ఆ తెలుగు నెలకు. అలాంటి పేరు పెట్టుకుని వస్తున్న ప్రేమకథా చిత్రం వైశాఖం. ఈ సినిమాను కూడా రాబోయే వైశాఖమాసంలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. 

హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై లేడీడైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా అందరికీ వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ 'వైశాఖం' చిత్ర విశేషాలను తెలియజేశారు. 

డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది.  ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ. ఒక అమ్మాయి వైశాఖంలా ఒక అబ్బాయి జీవితంలోకి ఎంటర్‌ అయి అతనిలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది, వీరి ప్రేమ ప్రయాణం వైశాఖంలో పెళ్ళి వరకు ఎలా వెళ్ళింది అనేది కథ. స్క్రీన్‌ప్లే చాలా డిఫరెంట్‌గా వుంటుంది'' అన్నారు. 

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''ప్రేమలో పావని కళ్యాణ్‌, చంటిగాడు, గుండమ్మగారి మనవడు ఇవన్నీ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్‌స్టోరీస్‌. లవ్‌లీ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన లవ్‌స్టోరీ. మా బేనర్‌లో లవ్‌ ఓరియంటెడ్‌ మూవీసే ఎక్కువగా తీశాము. అన్నీ మంచి సక్సెస్‌ అయ్యాయి. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన డిఫరెంట్‌ లవ్‌స్టోరీ 'వైశాఖం'. సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌లో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.  

హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.