Home > Movies - Press Releases
వెంకటాపురం సేఫ్ గేమ్

చాలా కాలం తరువాత హ్యాపీడేస్ రాహుల్ హీరోగా నటిస్తూ, శ్రేయా మీడియా అందిస్తున్న థ్రిల్లర్ వెంకటాపురం. చాలా సైలెంట్ గా హైదరాబాద్ లోకల్ నాచురల్ లోకేషన్లలో, విశాఖలో షూట్ చేసేసి ఫినిష్ చేసేసారు. జస్ట్ పబ్లిసిటీ, క్యూబ్, ప్రొడక్షన్ అన్నీ కలిపి రెండు కోట్లలోపే కానిచ్చేయగలిగారు. ఆంధ్రను హ్యాపీగా కొటి రూపాయిల రేషియోలోనూ, సీడెడ్ 20 లక్షల రేషియోలో, ఓవర్ సీస్ 15 లక్షలకు కాస్త అటు ఇటుగా ఇచ్చేసారు. నైజాం మిగిలింది. నైజాంలో టోటల్ రన్ కోటి రూపాయిలు షేర్ చేస్తే గట్టెక్కేసినట్లే. టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లలో వదుల్తున్నారు. మార్కెట్ లో బాహుబలి ఊపు తగ్గింది. మరోపక్క సినిమాలు లేవు. అందువల్ల వెంకటాపురం సేఫ్ జోన్ లో వున్నట్లే.