Advertisement


Home > Movies - Press Releases
'వైశాఖం' , విజువల్స్‌ - సూపర్‌స్టార్‌ మహేష్‌

'ప్రేమలో పావని కళ్యాణ్‌', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి దర్శకత్వంలో బి.ఎ. రాజు నిర్మిస్తున్న లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'వైశాఖం'. ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై హరీష్‌, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రానికి డి.జె. వసంత్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మార్చి 16న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర ప్రముఖులు, అతిథుల మధ్య గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ మహేష్‌ ముఖ్య అతిథిగా విచ్చేయగా స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌,  మైత్రి మూవీస్‌ అధినేత వై. రవిశంకర్‌, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, ప్రముఖ నిర్మాతలు బెల్లంకొండ సురేష్‌, ద‌ర్శకుడు మెహ‌ర్ ర‌మేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. 

మంచి టైటిల్‌తో సినిమా చేయడం హ్యాపీగా ఉంది!! 
స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''చైత్రమాసంలో వసంత రుతువు వస్తుందని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ తర్వాత వైశాఖ మాసం వస్తుంది. 'వైశాఖం'లాంటి మంచి టైటిల్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటూ జయ గారికి, రాజుగారికి నా అభినందనలు తెలియచేస్తున్నాను'' అన్నారు. 

వారిద్దరి తర్వాత జయగారే!! 
ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''భానుమతి, విజయనిర్మల గారి తర్వాత మహిళా దర్శకుల్లో జయగారే. రాజుగారు, జయగారు ప్యాషన్‌తో సినిమాలు తీస్తారు. హరీష్‌, అవంతికలతో పాటు టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. 'వైశాఖం' బిగ్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం వుంది'' అన్నారు. 

సాంగ్స్‌ అన్నీ విజువల్‌గా బాగా వచ్చాయి!! 
డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''ఈ ఫంక్షన్‌ ఇంత గ్రాండ్‌గా జరగడానికి కారణం సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబే కారణం. రజనీకాంత్‌గారి తర్వాత మాకు సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. ఆయన వచ్చిన ఈ ఆడియో ఫంక్షన్‌కి ఒక కళ వచ్చింది. చాలా బాగా జరిగింది. మహేష్‌బాబు, మురుగదాస్‌ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాపై ఎంత క్రేజ్‌ ఉందో అందరికీ తెలుసు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి టోటల్‌ ఇండియా రికార్డ్స్‌ అన్నీ క్రాస్‌ చేసి చాలా చాలా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. నాకున్న కోరికల్లో నా ఫస్ట్‌ కోరిక అది. తర్వాతే మా 'వైశాఖం'. నాకు చాలా చాలా ఇష్టమైన రైటర్‌ త్రివిక్రమ్‌ గారు. ఆయన సినిమాలు సాధారణంగా 2, 3 సార్లు చూస్తాను. ఒకటి యూజువల్‌గా చూస్తాను, రెండు ఆయన డైలాగ్స్‌ కోసం. మూడు ఆయన డైలాగ్స్‌ పేర్చిన విధానం, ఆ సినిమా తీసే టెక్నిక్‌ పట్టుకోవాలని చూస్తాను. మా రైటర్స్‌ని త్రివిక్రమ్‌ గారిలా ఒక్క డైలాగ్‌ అన్నా రాయండని చెప్తుంటాను. అది మా వల్లకాలేదు. 'వైశాఖం'లో కూడా ట్రై చేశాం. సినిమా చూస్తే అందరికీ అర్ధం అవుతుంది. ఎక్కడ ట్రై చేశామో. మేము ఇంకా ట్రై చేస్తూనే ఉంటాం. త్రివిక్రమ్‌ గారు మాత్రం ఇంకా హైట్స్‌కి వెళ్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికీ మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ రైటర్‌ ఆయన. రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల చాలా మంచి లిరిక్స్‌ రాశారు. అలాగే శ్రీమణి కూడా మంచి పాటలు రాశారు. ఫస్ట్‌ అతను గాయకుడుగా మా ఆఫీస్‌కి వచ్చారు. కథ విని ఇన్‌స్పైర్‌ అయి మంచి పాటలు రాశారు. నాకు ఎలాంటి డౌట్స్‌ ఉన్నా ఇమీడియట్‌గా రాసి ఇచ్చేవారు. 

హీరో హరీష్‌ మాట్లాడుతూ - ''నాలాంటి కొత్తవారిని ఎంకరేజ్‌ చేయడానికి సూపర్‌స్టార్‌ మహేష్‌గారు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా టీమ్‌ని బ్లెస్‌ చేయడానికి వచ్చిన త్రివిక్రమ్‌గారికి, వంశీ పైడిపల్లి గారికి నా థాంక్స్‌. నా వెన్నుతట్టి 'వైశాఖం'తో హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్న జయగారికి, రాజుగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. శేఖర్‌ మాస్టర్‌ అన్ని పాటలకి మంచి కొరియోగ్రఫి కంపోజ్‌ చేశారు. నాతో మంచి స్టెప్స్‌ వేయించారు. బాగా చేశాననే అనుకుంటున్నాను. అందరికీ నచ్చుతాయని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను. సుబ్బారావు మంచి ఫొటోగ్రఫి అందించారు. విజువల్స్‌ అన్నీ చాలా బాగా వచ్చాయి. వసంత్‌ మంచి ట్యూన్స్‌ అందించారు. పెద్ద హీరోలకి చేసినట్లుగానే మంచి సాంగ్స్‌ ఇచ్చారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు. 

మహేష్‌ది గోల్డెన్‌ హ్యాండ్‌!! 
నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ - ''ఈ ఫంక్షన్‌ ఇంత గ్రాండ్‌గా జరిగింది అంటే మహేష్‌బాబు గారే కారణం. షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉండి కూడా మా మీద అభిమానంతో ఈ ఫంక్షన్‌కి వచ్చినందుకు సిన్సియర్‌గా ఆయనకు నా స్పెషల్‌ థాంక్స్‌ చెబుతున్నాను. ఆయన హ్యాండ్‌ గోల్డెన్‌ హ్యాండ్‌. ఆయన హ్యాండ్‌తో ఆరు సినిమాలు ఆడియో రిలీజ్‌ చేశాం. ఆరూ హిట్‌ అయ్యాయి. ఇది ఏడవ సినిమా. ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ అవుతుంది. కేవలం ఒక్క ఫోన్‌ చేయగానే త్రివిక్రమ్‌గారు, వంశీ పైడిపల్లిగారు వచ్చినందుకు వారికి నా థాంక్స్‌'' అన్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మాట్లాడుతూ - ''ఇండస్ట్రీలో నాకు బాగా కావాల్సిన వ్యక్తుల్లో బి.ఎ. రాజు గారు ఒకరు. ఆయనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. 'వైశాఖం' పాటలు, విజువల్స్‌ చాలా బాగున్నాయి. జయగారికి, హరీష్‌, అవంతిక, టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా పెద్దహిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.