Advertisement


Home > Politics - Gossip
టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ నేత: నయీం కోటాలో.!

'గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తో మాకెలాంటి సంబంధాల్లేవు.. అధికార టీఆర్‌ఎస్‌, అడ్డగోలుగా మాపై ఆరోపణలు చేస్తోంది.. రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తోంది.. బెదిరింపులకు లొంగేది లేదు..' 

- కొన్నాళ్ళ క్రితం మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమా మాధవరెడ్డి చేసిన వ్యాఖ్యలివి. 

కానీ, ఇప్పుడామె తన కుమారుడితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే అంత మార్పు ఎలా సాధ్యమయ్యిందట.? అంతా 'నయీమ్‌ ఎఫెక్ట్‌' అనుకోవాలేమో.! కాదు కాదు, తెలంగాణ టీడీపీకి రేవంత్‌రెడ్డి గుడ్‌ బై చెప్పాక, తెలంగాణలో టీడీపీకి భవిష్యత్‌ లేదనే నిర్ణయానికి వచ్చాకే ఉమా మాధవరెడ్డి పార్టీని వీడాలనుకున్నారనుకోవాలా.? 

మాధవరెడ్డి.. అంటే, ఒకప్పుడు మోస్ట్‌ పవర్‌ఫుల్‌ లీడర్‌ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు. టీడీపీలో నెంబర్‌ టూ పొజిషన్‌ని దక్కించుకున్నవారిలో ఆయనా ఒకరు. అలాంటి మాధవరెడ్డి మరణం తర్వాత ఈక్వేషన్స్‌ మారాయి. మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి, టీడీపీలో కీలక నేతగా ఎదిగినా, మాధవరెడ్డి స్థాయిలో టీడీపీకి 'వెన్నెముక'గా నిలవలేకపోయారు. 2014 ఎన్నికల తర్వాత ఉమా మాధవరెడ్డి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. టీడీపీలోనే ఎవరూ లెక్కచేయని పరిస్థితి. 

అలా అలా టీడీపీలో నెట్టుకొచ్చేసిన ఉమా మాధవరెడ్డి, నయీం ఎపిసోడ్‌ తర్వాత రాజకీయంగా మరింత 'ఒంటరి' అయ్యారనే చెప్పాలి. ఆ సమయంలో టీడీపీ, ఉమా మాధవరెడ్డికి ఆశించిన స్థాయిలో అండగా నిలవలేకపోయింది. టీఆర్‌ఎస్‌తో ఒంటరిపోరాటం చేయలేక, అప్పటినుంచే ఆమె 'సర్దుకుపోయారు' అనే వాదనలూ లేకపోలేదు. రేవంత్‌రెడ్డి టీడీపీని వీడాక, పూర్తిగా ఓ క్లారిటీ తెచ్చుకున్న ఉమా మాధవరెడ్డి, సరైన 'సమయం' కోసం ఎదురుచూశారు.. పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 

ఉమా మాధవరెడ్డి, టీడీపీని వీడటంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే, ఆల్రెడీ టీడీపీ నిండా మునిగిపోయింది గనుక. అందుకే, ఉమా మాధవరెడ్డి పార్టీ మార్పుపై స్పందించడానికీ టీడీపీ నేతలెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.