Advertisement


Home > Politics - Gossip
అడ్డపంచె వీడి.. ధోవతి కట్టిన వెంకయ్య!

వెంకయ్య నాయుడు అంటే ఆకుకు అందని పోకకు పొందని మాటల అల్లికతో బెదర గొట్టే  ప్రసంగాలు ఉద్ధండుడిగా మాత్రమే మనకు తెలుసు. అయితే ఆయన అచ్చమైన దక్షిణాది ఆహార్యానికి కూడా నిలువెత్తు నిదర్శనం. ఆయన దుస్తుల గెటప్ చూడగానే.. అచ్చంగా దక్షిణాది నాయకత్వ లక్షణం స్ఫురణకు వచ్చేస్తుంది. అచ్చమైన అడ్డ పంచె కట్టుకుని... నిండైన తెలుగుదనంతో కనిపించే వ్యక్తిగా వెంకయ్యనాయుడుకు విలక్షణమైన గుర్తింపు ఉంది.

సాధారణంగా నాయకులు తాము ఎలాంటి వ్యక్తిగత డ్రెస్ కోడ్ పాటిస్తూ ఉండే వారైనా సరే.. భారత రాష్ట్రపపతి , ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లోకి వెళ్లినప్పుడు.. సహజంగా.. బంద్ గలా సూట్ లలోకి మారిపోతూ ఉంటారు. ఆ పదవులు అంటేనే.. అదొక యూనిఫాం అన్నట్లుగా ముద్ర పడిపోయింది. రాష్ట్రపతుల్లో అబ్దుల్ కలాం కొంత వైవిధ్యం పాటించారు. ఆయన కొన్ని సందర్భాల్లో బంద్ గలా సూట్లతోనే వెళ్తూ వచ్చినప్పటికీ.. ఎక్కువ సార్లు తనకు ఇష్టమైన నీలం రంగు ఫుల్ స్లీవ్స్ షర్ట్ లోనే టక్ చేసుకుని కనిపించేవారు.

ఉపరాష్ట్రపతి అయిన తరువాత.. వెంకయ్యనాయుడు కూడా తన సొంత డ్రస్ కోడ్ ను అలవాటును వదలుకోలేదు. కొత్తగా వచ్చిన పదవి డ్రస్ సెన్స్ పరంగా ఆయనలో ఎలాంటి మార్పుతేలేకపోయింది. ఆయన ఎంచక్కా దక్షిణాది నాయకుడి మాదిరిగానే అడ్డపంచె కట్టుకుని నిందుగా రాజ్యసభ ఛైర్మన్ సీట్లో ఆసీనులయ్యారు.

మామూలుగా వెంకయ్యనాయుడు కట్టే అడ్డపంచె అరవ సాంప్రదాయానికి సంబంధించిం. తమిళులు ఇలాంటి పంచెకట్టునే తమ సాంప్రదాయంగా భావిస్తారు. దీన్ని లుంగీ కట్టుగా కూడా వ్యవహరిస్తారు. వెంకయ్య స్వస్థలం అయిన నెల్లూరు జిల్లాపై తమిళ ప్రభావం చాలా ఎక్కువ ఆ ఏరియాలో ఇదే పంచెకట్టుగా చెలామణీ అవుతుంది.

అయితే వెంకయ్యనాయుడు సంక్రాంతి సందర్భంగా తిరుమలేశుని దర్శనానికి, సొంత ఊరికి వెళ్లినప్పుడు.. తెలుగువాడి స్పెషల్ గా భావించే అచ్చమైన ధోవతి కట్టు (గోచికట్టు) లో కనిపించారు. ఆప్తులు కానుకగా అందించిన ఇది రెడీమేడ్ ధోవతి కట్టు అయినప్పటికీ... కొన్ని దశాబ్దాలుగా తమిళ అడ్డపంచె కట్టుతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వెంకయ్యనాయుడు సైకిల్ కట్టు ధోవతిలోకి మారే సరికి విభిన్నంగా ఉన్నారని.. ఉపరాష్ట్రపతి పదవికి మరింత వన్నె తెచ్చే విధంగా నిండైన తెలుగుదనంతోనే ఉన్నారని ప్రజలు అంటున్నారు.