Advertisement


Home > Politics - Gossip
ఓట్ల కోసం ఇంతలా దిగజారిపోవాలా.?

రాజకీయాల్లో 'దిగజారుడుతనం' అన్న మాట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే, రాజకీయమంటేనే దిగజారుడుతనమనేంతలా రాజకీయాల్లో 'విలువలు' ఎప్పుడో దిగజారిపోయాయి మరి.! ఆ దిగజారుడు రాజకీయాలకి పరాకాష్టగా మారిపోయాయి గుజరాత్‌ ఎన్నికలు. 

మామూలుగా అయితే ఎన్నికల్లో, కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదు. కానీ, కమలనాథులు హద్దులు చెరిపేశారు. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేసేస్తున్నారక్కడ.. ఇంకో అడుగు ముందుకేసి, ఎన్నికల్లోకి పొరుగుదేశం పాకిస్తాన్‌ని కూడా లాగేశారు. ఓ కింది స్థాయి నేత కూడా చేయనంతగా దిగజారుడు రాజకీయాలు చేసేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 'పాకిస్తాన్‌, గుజరాత్‌ ఎన్నికల్ని శాసించాలనుకుంటోంది.. ఆ దిశగా కాంగ్రెస్‌ నేతలు, పాకిస్తాన్‌తో చర్చలు జరిపారు' అంటూ మోడీ, గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఆరోపిస్తోన్న విషయం విదితమే. 

మోడీ తీరుపై పాకిస్తాన్‌ స్పందించింది. 'పొరుగుదేశం రాజకీయాల్లో మేం తలదూర్చడంలేదు. ఆ అవసరం మాకు అసలే లేదు. మాపై బురద జల్లడం మానుకుని, తమ సొంత బలంపై నరేంద్రమోడీ దృష్టిపెట్టడం మంచిది.. మోడీ మాత్రమే కాదు, పొరుగుదేశంలో ఎవరైనాసరే, ఆ దేశం ఎన్నికల్లో మా పేరు వాడకపోతేనే మంచిది..' అంట పాక్‌ విదేశాంగ శాఖ ఉచిత సలహా ఇచ్చింది. 

సిగ్గు సిగ్గు.. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసిన పాకిస్తాన్‌ నుంచి భారతదేశం 'ఉచిత సలహాల్ని' తీసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. నిజమే మరి, ఆ స్థాయిలో మన విలువల్ని మన ప్రధాని నరేంద్రమోడీ దిగజార్చేస్తున్నారు కాబట్టి, పాకిస్తాన్‌ ఏం ఖర్మ.. ఎవరనా సలహాలిచ్చేస్తారు. 

ఎన్నికల్లో గెలుపోటములనేది ఓ 'అంశం' మాత్రమే. ఇక్కడ, మోడీ పాకిస్తాన్‌ పేరుతో కాంగ్రెస్‌ని దెబ్బకొట్టాలనుకోవడం మాటెలా వున్నా, దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందిప్పుడు. మోడీ ప్రధాని అయ్యాక దేశం వెలిగిపోతోందా.? లేదా.? అనేది వేరే విషయం. పాకిస్తాన్‌ దృష్టిలో కూడా చులకనైపోయే పరిస్థితిని మోడీ తీసుకొచ్చారన్నది నిర్వివాదాంశం.