
ఎమ్బీయస్ ప్రసాద్ (1951-) ఆంగ్లాంధ్రాలలో కథారచయిత, వ్యాసరచయిత. అనువాదకుడు, సంపాదకుడు, వెబ్‍సైట్‍లో శీర్షికా నిర్వాహకుడు. రేడియో జాకీ, టీవీ యాంకర్. వీరు వ్రాసిన అనేక కథలు బహుమతులనందాయి. వందలాది కథలు, వేలాది వ్యాసాలు రాశారు. ఇప్పటివరకు 25 పుస్తకాలు వెలువడ్డాయి. మరో 20 పుస్తకాలు ఈ-బుక్స్గా వెలువడ్డాయి. వీరి సాహితీవ్యవసాయం బహుముఖాలుగా సాగింది. కాస్త విపులంగా చెప్పాలంటే….
కథారచయితగా…* హాస్య రచనలు – అచలపతి కథలు, రాంపండు లీలలు, (ఉడ్‍హౌస్ స్ఫూర్తితో రాసినవి) పొగబోతు భార్య, టేకిట్ ఈజీ కథాసంకలనాలు, ఇంకా ఇతర కథలు * సీరియస్ రచనలు – కాగితాల బొత్తి కథాసంకలనం, ఇంకా వందలాది ఇతర కథలు, * క్రైమ్ రచనలు – కథా సంకలనం – .38 కాలిబర్, నవలలు – ఉమనీటర్, ‘టార్గెట్ 8’
ఇండో – ఆంగ్లియన్ రచయితగా… * ఇంగ్లీషులో స్వతంత్రంగా కథలు రాసే అతి కొద్దిమంది తెలుగువాళ్లలో వీరొకరు. వీరు రాసిన కథలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎలైవ్, విమెన్స్ ఎరా, ఏపి టైమ్స్ లలో ప్రచురితమవుతూంటాయి. ‘‘ద లాస్ట్ విష్’’, ‘‘డెత్ ఆఫ్ ఎ ఫ్యుజిటివ్’’, ‘‘యువర్స్ ట్రూలీ దండపాణి’’, ‘‘ద సెఫాలజిస్ట్’’, ‘‘ద నెగోషియేటర్’’, ‘‘మిసెస్ సేఠ్’’ వాటిలో కొన్ని.
వ్యాసరచయితగా… * రాజకీయచరిత్ర – ‘‘హిస్టరీ మేడీజీ’’ ‘‘రాజీవ్ హత్య’’. ‘‘గోడ్సేని ఎలా చూడాలి?’’ ఇంకా అనేక ఇతర రచనలు, ప్రస్తుతం ‘‘తమిళ రాజకీయాలు’’, ‘‘నిజాం కథలు’’, ‘‘ఎమర్జన్సీ ఎట్ 40’’ సీరియల్స్ రాస్తున్నారు. వాటిలో కొన్ని భాగాలు ఈ-బుక్స్గా వెలువడ్డాయి. * లలితకళలు – హిందీ, ఇంగ్లీషు సినీ కళాకారులపై అనేక వ్యాసాలు రాశారు, రాస్తున్నారు. ఇతర భాషా రచనల, చిత్రాలపై ఆధారపడిన తెలుగు సినిమాల గురించి ‘‘సినీమూలం’’ సీరియల్ * కొన్ని మేలైన తెలుగుకథలను ‘‘నచ్చిన కథలు’’ పేరుతో సంకలనం చేశారు. ఈ-బుక్‍గా లభిస్తోంది. ‘‘బైబిల్’’ను అందరికీ అనువైన రీతిలో ‘‘బైబిల్ కథలు’’గా రాశారు.
జీవితచరిత్రకారునిగా… * హిందీ నటగాయకుడు కిశోర్‍కుమార్ పై ‘‘కిశోర్ జీవనఝరి’’ పుస్తకం వెలువరించారు. ‘‘ప్రాణ్’’, ‘‘హేమమాలిని’’ ‘‘వినోద్ మెహతా’’ పై రాసిన పుస్తకాలు ఈ-బుక్స్గా వెలువడ్డాయి. ‘‘జగన్ ప్రస్థానంలో ఓ దశాబ్ది (2009-19)’’ పుస్తకంగా వెలువడింది.
సినీరంగంలో… ప్రఖ్యాత సినీదర్శకుడు గుణశేఖర్ ‘‘రుద్రమదేవి’’ సినిమా కథాపరిశోధనా బృందం (డా।। ముదిగొండ శివప్రసాద్, శ్రీ మధుబాబులతో)లో సభ్యుడు * అక్కినేనిపై ఇంగ్లీషులో వెలువడిన డాక్యుమెంటరీకి స్క్రిప్టు అందించారు
అనువాదకుడిగా… * హిందీ నుండి తెలుగులోకి – గంగాధర్ గాడ్గీళ్ ‘‘బండోపంత్’’ కథలు, యితర కథలు * ఇంగ్లీషు నుండి తెలుగులోకి – పి జి ఉడ్‍హౌస్, డరోతి పార్కర్, అగాథా క్రిస్టి మొ।।వారి కథలు * తెలుగునుండి నుండి ఇంగ్లీషు – ముళ్లపూడి వెంకటరమణ, చంద్ర రచనలకు వీరి అనువాదాలు తానా సువెనీర్ (1995), ఎపి టైమ్స్‌లో ప్రచురితమయ్యాయి. * పిల్లలకోసం డా।। డూలిటిల్ ఇంగ్లీషు సినిమాను తెలుగులో నవలగా రాశారు.
ఇవి కాక…
కాలమిస్టుగా.. * గ్రేట్ ఆంధ్రా డాట్‍కామ్ అనే వెబ్‍సైట్‍లో ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై ‘‘ఎమ్బీయస్ కబుర్లు’’ అనే శీర్షికను 2009 నుండి నిర్వహిస్తున్నారు.
సంకలనకర్తగా, సంపాదకుడిగా… బాపు-ముళ్లపూడిల ‘‘బొమ్మా-బొరుసూ’’ (1995)కు రమణగారి రచనలను సేకరించారు. * 8-సంపుటాల ‘ముళ్లపూడి సాహితీ సర్వస్వం’ (2000-2006)కు సంకలనం, సంపాదకత్వం, ముందుమాట * ‘‘బాపురమణీయం’’ ద్వితీయముద్రణకు సంపాదకత్వం * బాపు-రమణల ‘‘కోతికొమ్మచ్చి’’ సీరీస్ పుస్తకాల రూపకల్పనలో ముఖ్యభూమిక
పత్రికా సంపాదకుడిగా….స్టేటుబ్యాంకు ఆఫీసరు ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీవిరమణ చేసి ‘‘హాసం’’ పత్రిక (2001-2004)కు మేనేజింగ్ ఎడిటర్‍గా..
ప్రచురణా నిర్వహణ …. * హాస్య-సంగీత అంశాలపై ప్రముఖుల పుస్తకాలు ప్రచురించిన ‘హాసం’ ప్రచురణలకు (ఇప్పటి వరకు 40 పుస్తకాలు) సంచాలకుడు * రాష్ట్రవ్యాప్తంగా శాఖలున్న ‘హాసం క్లబ్స్’కు సంధానకర్త
రేడియో జాకీగా… 2005 నుండి శాటిలైట్ రేడియో ‘‘వరల్డ్‌స్పేస్’’లో స్పందన తెలుగు రేడియో స్టేషన్‍లో వారం వారం ‘పడక్కుర్చీ కబుర్లు’ కార్యక్రమంలో రెండేళ్లపాటు వివిధ విషయాలపై ప్రసంగించారు. * కోతికొమ్మచ్చి ఆడియో పుస్తకానికి స్వరదాతల్లో ఒకరు
టీవీ యాంకర్‍గా .. ఇతర భాషా చిత్రాలనుండి స్ఫూర్తి పొందిన తెలుగు సినిమా రచయితలు తెలుగు వెర్షన్‍కు ఏ విధంగా మెరుగులు దిద్దారో వివరించే ‘ఇదీ అసలు కథ’ కార్యక్రమం రచన, వాయిస్ ఓవర్, యాంకరింగ్- వనితా టీవీలో – సమర్పించారు. ఈ కార్యక్రమం 2009 రజిత నంది ఎవార్డు గెలుచుకుంది.
పురస్కారాలు, బహుమతులు – * తెలుగు యూనివర్శిటీ నుండి ‘హాస్యరచయితగా కీర్తి పురస్కారం, 2009 * హాస్యరచయితగా ఆంధ్రసారస్వత సమితి, మచిలీపట్నం 2011 ఉగాది పురస్కారం * ‘‘స్వాతి’’ వీక్లీ కథల పోటీలో చాలాసార్లు ప్రథమ బహుమతులు * ఢిల్లీ తెలుగు ఎకాడమీ, 2014 ఉగాది పురస్కారం * తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) వారిచే 2015లో లండన్‍లో సన్మానం
అడ్రసు MBS Prasad email: [email protected]