cloudfront

Advertisement


Home > Movies - Movie News

దీపిక, రణ్వీర్ కోసం ఖరీదైన ఇల్లు

దీపిక, రణ్వీర్ కోసం ఖరీదైన ఇల్లు

ఇన్నాళ్లూ విడివిడిగా ఉన్నారు. ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు. మరి దీపిక-రణ్వీర్ కలిసి ఉండబోయే ఇల్లు ఏది? ఇన్నాళ్లూ ముంబయిలో రణ్వీర్ ఉంటున్న ఇంటిలోనే వీళ్లు కాపురం పెట్టబోతున్నారా? కాదు.. వీళ్ల కోసం ఇప్పుడో సరికొత్త ఫ్లాట్ రెడీ అయింది. దాని ఖరీదు అక్షరాలా 50 కోట్లు.

ముంబయిలోని ఖరీదైన ప్రాంతం జుహులో దీపిక-రణ్వీర్ కలిసి ఈ ఇల్లు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంట్లో ఫర్నిచర్, ఇంటీరియర్ ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. ఇటలీలో పెళ్లి చేసుకున్న ఈ జంట, ఇండియా వచ్చిన వెంటనే ఈ ఇంటిలోనే కాపురం పెడుతుంది.

ఇటలీలో సింధి, కొంకణి సంప్రదాయాల్లో వీళ్లు 2సార్లు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల్ని మాత్రమే ఆహ్వానించారు. ఈనెల 21న బెంగళూరులో భారీ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డిసెంబర్ 1న ముంబయిలో మరో భారీ రిసెప్షన్ పెట్టబోతున్నారు.

ఈ రెండు వేడుకలతో వీళ్ల పెళ్లి తతంగం ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త ఇంటిలోకి షిఫ్ట్ అవుతుంది ఈ జంట.