cloudfront

Advertisement


Home > Movies - Movie News

తాత, తండ్రి, మనవడు.. సేమ్ టు సేమ్

తాత, తండ్రి, మనవడు.. సేమ్ టు సేమ్

అక్కినేని హీరోలకు ఓ రకమైన రొమాంటిక్ ఇమేజ్ ఉంది. ఇప్పుడా ఇమేజ్ కోసం అఖిల్ కూడా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. దాని కోసం మేకోవర్ కూడా అయ్యాడు ఈ అక్కినేని హీరో. మిస్టర్ మజ్ను సినిమాలో అమ్మాయిల వెంటపడే రొమాంటిక్ అఖిల్ కనిపిస్తున్నాడు. 

అమ్మాయిల్ని పటాయించడంలో అక్కినేని హీరోలకు ఓ స్టయిల్ ఉంది. తాత ఏఎన్నార్ అప్పట్లో దసరా బుల్లోడు అనిపించుకుంటే, తండ్రి నాగార్జునకు ఆల్రెడీ మన్మధుడు అనే ఇమేజ్ ఉంది. హార్డ్ కోర్ అక్కినేని లేడీ ఫ్యాన్స్ అయితే గ్రీకువీరుడు అని కూడా పిలుచుకుంటారు. ఇప్పుడు మనవడు అఖిల్ కూడా అదే ఇమేజ్ ను కొనసాగించడం కోసం మిస్టర్ మజ్ను తీస్తున్నట్టుంది. ఈరోజు విడుదలైన టీజర్ లో అన్నీ ఆ ఛాయలే.

లవర్ బాయ్ గా, స్టయిలిష్ హంక్ గా అఖిల్ బాగానే ఉన్నాడు. హెయిర్ స్టయిల్ మాత్రం పెద్దగా సూట్ అయినట్టు లేదు. "ఏమిటో ఈ ఇంగ్లిష్ భాష, దేన్నయితే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు" అనే డైలాగ్ లో మాత్రం అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేశాడు అఖిల్. 

ఊహించని విధంగా ఫస్ట్ లుక్ అని చెప్పి ఏకంగా టీజర్ లాగా రిలీజ్ చేసి చిన్నపాటి షాక్ అయితే ఇచ్చాడు అఖిల్. కంప్లీట్ లవర్ బాయ్ గా కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎప్పట్లానే తమన్ మరోసారి పాత ట్యూన్స్ అన్నీ గుర్తుకొచ్చేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

వెంకీ అట్లూరి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా అఖిల్ జాతకాన్ని మారుస్తుందో లేక ఫ్లాపుల్లో హ్యాట్రిక్ అందిస్తుందో చూడాలి.