cloudfront

Advertisement


Home > Movies - Movie News

అంతా రెడీ.. హీరోయిన్ సెట్ అవ్వట్లేదంతే!

అంతా రెడీ.. హీరోయిన్ సెట్ అవ్వట్లేదంతే!

సాధారణంగా ఓ సినిమా ఫిక్స్ అయిపోయిన తర్వాత హీరోయిన్ గురించి ఆలోచిస్తారు. అవసరమైతే ముహూర్తం షాట్ కూడా పూర్తయి, ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత అప్పుడు తాపీగా హీరోయిన్ ను సెలక్ట్ చేస్తారు. కానీ కేవలం హీరోయిన్ ఎంపిక పూర్తవ్వలేదనే కారణంతో అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఆగిపోయింది. అవును.. హీరోయిన్ ఎవరో తేలేవరకు ఈ సినిమా సెట్స్ పైకి రాదు.

ఈ సినిమా కథలో హీరోయిన్ పాత్ర చాలాకీలకం అంటున్నారు. ఆ విధంగా స్టోరీ రాసుకున్నాడట బొమ్మరిల్లు భాస్కర్. దీంతో ఆ హీరోయిన్ ఎవరో తేలేవరకు కొబ్బరికాయ కొట్టొద్దని నిర్మాత అల్లు అరవింద్ కూడా తెగేసి చెప్పేశాడు. అలా అఖిల్ నాలుగు సినిమా ఆలస్యమౌతోంది.

నిజానికి అఖిల్ సరసన హీరోయిన్ ను సెలక్ట్ చేయడం పెద్ద సమస్య కాదు. తొలి 2 సినిమాలకు కొత్త హీరోయిన్లను తీసుకున్నారు. మూడో సినిమాకు ఒక సినిమా అనుభవం ఉన్న హీరోయిన్ ను తీసుకున్నారు. కాబట్టి మరో కొత్తమ్మాయిని సెలక్ట్ చేస్తే పనైపోతుంది. కానీ బొమ్మరిల్లు భాస్కర్ ఒప్పుకోవడంలేదు.

తనపాత్రకు కాస్త అనుభవం ఉన్న నటి కావాలంటున్నాడు భాస్కర్. సో.. ఫస్ట్ టైమ్ తన కెరీర్ లో తనకంటే కాస్త సీనియారిటీ ఎక్కువున్న హీరోయిన్ తో అఖిల్ నటించబోతున్నాడన్నమాట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. కాస్త సీనియారిటీ ఉన్న ఏ అమ్మాయిని తీసుకున్నా ఆమె అఖిల్ కంటే పెద్దగా కనిపించడం ఖాయం. 

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!