cloudfront

Advertisement


Home > Movies - Movie News

అది నా తప్పు కాదు: అల్లు శిరీష్

అది నా తప్పు కాదు: అల్లు శిరీష్

అల్లుశిరీష్ నుంచి ఓ సినిమా వచ్చిందంటే, మళ్లీ నెక్ట్స్ మూవీ ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురు చూడాల్సిందే. అలా సినిమా-సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటాడు ఈ హీరో. ఇదే విషయంపై మీడియా ప్రశ్నిస్తే అందులో తన తప్పు లేదన్నట్టుగా మాట్లాడాడు శిరీష్. కేవలం మేకర్స్ వల్ల మాత్రమే తన సినిమాలు లేట్ అవుతాయని, తను మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్షీట్లు ఇస్తానని చెబుతున్నాడు.

ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఏబీసీడీ సినిమా. నిజానికి ఇది 3 నెలల కిందటే రావాల్సిన మూవీ. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కేవలం అల్లుశిరీష్ జోక్యం వల్లనే సినిమా ఆలస్యమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. అల్లుశిరీష్ మాత్రం అది తన తప్పుకాదని, నటుడిగా ఎదిగేందుకు సన్నివేశాలపై మరింత దృష్టిపెట్టడం వల్ల అలా జరిగిందని అంటున్నాడు.

ఏబీసీడీ సినిమాను యథాతథంగా రీమేక్ చేయాలని ముందుగా భావించారు. అదే కాన్సెప్ట్ తో సెట్స్ పైకి కూడా వెళ్లారు. కానీ సెట్స్ పైకి వెళ్లి తర్వాత అల్లు శిరీష్ లో క్రియేటివిటీ పెరిగింది. టాలీవుడ్ ట్రెండ్ కు తగ్గట్టు మరిన్ని మార్పులు చేయాలన్నాడు. అలా కొత్తగా 50 సీన్లు రాసుకున్నారు. మళ్లీ వాటిని షూట్ చేశారు. వాటిలోంచి కొన్ని తీసేసి, మళ్లీ ఒరిజినల్ సినిమాలో సీన్లనే రాసుకొని షూట్ చేశారు. ఇలా గజిబిజిగా జరిగింది ఏబీసీడీ షూటింగ్.

అల్లుశిరీష్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ సినిమా మొత్తం రీ-రైట్ చేశామని, ఓ 10-15 సీన్లు మాత్రమే పాత సినిమాలా ఉంటాయని అంటున్నాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అల్లుశిరీష్ కు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు నిపుణుడే