cloudfront

Advertisement


Home > Movies - Movie News

సీనియర్ నటుడిపై రేప్ ఆరోపణలు!

సీనియర్ నటుడిపై రేప్ ఆరోపణలు!

Me Too ట్వీట్లతో బాలీవుడ్ షేక్ అవుతోంది. ఇటీవల తనుశ్రీ దత్తా ఇండియాకు వచ్చి రేపిన మంటలు.. బాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇండియాలో ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొన్న మహిళలు వాటిని బయటపెట్టరు.. అని తనుశ్రీ ఏ ముహూర్తాన వ్యాఖ్యానించిందో కానీ.. ఇప్పుడు ఇలాంటి వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఎప్పుడెప్పుడో తాము ఎదుర్కొన్న అనుభవాల గురించి వీరు ధైర్యంగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు.. హిందీ చిత్ర పరిశ్రమలో తండ్రి పాత్రలకు కేరాఫ్ అయిన అలోక్ నాథ్ మీద అత్యాచార ఆరోపణలు వస్తున్నాయి. వింటా నందా అనే రచయిత్రి కమ్ ప్రొడ్యూసర్ అలోక్ మీద అత్యాచార ఆరోపణలు చేశారు. ఆ నటుడు తనను రేప్ చేశాడని ఆమె అంటోంది.

ఇప్పుడు కాదు..19 సంవత్సరాల కిందట ఈ సంఘటన చోటు చేసుకుందని ఆమె ఆరోపిస్తోంది. ఇన్నేళ్లు తను ఈ విషయాన్ని బయటపెట్టలేకపోయానని.. ఇప్పుడు చెబుతున్నానని ఆమె ట్వీట్ చేసింది.

మొత్తానికి ఆ ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. నందా ఆరోపణల నేపథ్యంలో అలోక్‌ సినీనట సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ వస్తోంది. అయితే ప్రస్తుతానికి ఆయన వివరణ కోరినట్టుగా హిందీ నటీనటుల సంఘం ప్రకటించింది.