Advertisement


Home > Movies - Movie News
క్లాస్+మాస్: 'అరవింద' పంద్రాగస్ట్ గిఫ్ట్ రెడీ

ప్రచారం నిజమైంది. కథనాల్లో వాస్తవం ఉందని తేలింది. ఆగస్ట్ 15న అరవింద సమేత టీజర్ విడుదలకాబోతోంది. స్వయంగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. టైమ్ ఎప్పుడనేది రేపోమాపో ఎనౌన్స్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

నిజానికి అరవింద సమేత టీజర్ ఎడిటింగ్ ఇప్పటికే పూర్తయింది. కాకపోతే దీన్ని ఇంకా ఎన్టీఆర్ చూడలేదు. ఎన్టీఆర్ ఏమైనా మార్పులు చెబితే సరే. లేకపోతే అదే టీజర్ ను ఆగస్ట్ 15న యాజ్ ఇటీజ్ గా విడుదల చేయబోతున్నారు. త్రివిక్రమ్ స్టయిల్ లో కాస్త క్లాస్ గా, ఎన్టీఆర్ అభిమానుల కోసం ఇంకాస్త మాస్ టచ్ ఇస్తూ ఈ టీజర్ ను కట్ చేసినట్టు తెలుస్తోంది. 

మరోవైపు ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఆగస్ట్ 15నే క్లారిటీ రాబోతోంది. సినిమాకు సంబంధించి ఇంకా చాలా షూటింగ్ పెండింగ్ లో ఉందని, దసరాకు రిలీజ్ డౌట్ అంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో.. టీజర్ తో పాటు విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించాలని యూనిట్ నిర్ణయించింది.

ఇక టీజర్ ను కూడా ఎలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పూర్తిగా తన కంట్రోల్ లో ఉంచుకున్నాడు త్రివిక్రమ్. వాట్సాప్ లో షేర్ చేయకుండా, కావాల్సిన వాళ్లను ఎడిట్ రూమ్ కు పిలిచి మరీ చూపిస్తున్నాడు. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ అప్రూవల్ కోసం వెయిటింగ్. మిగతాదంతా సెట్ అయిపోయింది.