Advertisement


Home > Movies - Movie News
ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్న బన్నీ

వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీకి ఇవాళ్టి నుంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాడు. అవును.. నా పేరు సూర్య సినిమాకు సంబంధించి ఈరోజు నుంచి హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబంధించి క్లైమాక్స్ ఫైట్ తీస్తారు.

మొన్నటివరకు ఈ సినిమాకు సంబంధించి శ్రీనగర్ లోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్ జరిగింది. అక్కడ ఓ సాంగ్, ఓ ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఈ షెడ్యూల్ తర్వాత గ్యాప్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు బన్నీ. అదే ఊపులో క్లైమాక్స్ ఫైట్ కూడా కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఒక్కరోజు మాత్రమే గ్యాప్ తీసుకొని ఇవాళ్టి నుంచి మరో భారీ షెడ్యూల్ కు రెడీ అయిపోయాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరుకు నా పేరు సూర్య షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. మరోవైపు దశలవారీగా సాంగ్స్ రిలీజ్ చేసే కార్యక్రమం కూడా షురూ చేశారు. ఇందులో భాగంగా ఎల్లుండి (14వ తేదీన) మరోసాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 27న సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.