cloudfront

Advertisement


Home > Movies - Movie News

చిన్నల్లుడి పేరు మార్చేసిన చిరంజీవి

చిన్నల్లుడి పేరు మార్చేసిన చిరంజీవి

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా విజేత. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ చూస్తే అల్లుడు సక్సెస్ ఫుల్ కెరీర్ కోసం చిరంజీవి న్యూమరాలజీని ఫాలో అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

చిరంజీవి చిన్నల్లుడు పేరు కల్యాణ్, పూర్తి పేరు కల్యాణ్ దేవ్. ఇంగ్లిష్ లో kalyan dev అని రాయాలి. అంటే ఈ పేరులో 9అక్షరాలుంటాయి. న్యూమరాలజీ ప్రకారం 9 అక్షరాల పేరు కూడా చాలామందికి కలిసొస్తుంది. అయితే అల్లుడి జాతకం ప్రకారం ఆయనకు 11అక్షరాల పేరయితే బాగా కలిసొస్తుందని చిరంజీవికి ఓ జ్యోతిష్కుడు సూచించాడు. దీంతో అల్లుడి పేరుని 11అక్షరాల kalyaan dhev గా మార్చారు చిరంజీవి.

తొలి సినిమా విజేత ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ 11అక్షరాల పేరుని ప్రజెంట్ చేశారు. శ్రీజ వెడ్డింగ్ కార్డ్ చూస్తే అందులో kalyan అని మాత్రమే ఉంటుంది. అయితే సినిమా విషయానికి వచ్చే సరికి న్యూమరాలజీ ప్రకారం kalyaan dhev గా మారిపోయాడు చిరు చిన్నల్లుడు.

కొడుకు రామ్ చరణ్ విషయంలో కూడా గతంలో ఇలాగే చేశారు చిరంజీవి. 11అక్షరాల ram charan tej పేరుని 9అక్షరాల ram charan గా మార్చారు. 12 అక్షరాల పేరుని న్యూమరాలజీ ప్రకారం 9 అక్షరాలకు కుదించారు, అప్పట్లో తన పేరు రామ్ చరణ్ తేజ్ కాదని, కేవలం రామ్ చరణ్ మాత్రమేనని చెర్రీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడంటే మెగా ఫ్యామిలీలో న్యూమరాలజీ పిచ్చిని అర్థంచేసుకోవచ్చు. మరి ఈ న్యూమరాలజీ అల్లుడికి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.