cloudfront

Advertisement


Home > Movies - Movie News

దర్శకుడిగా మారిన కమెడియన్

దర్శకుడిగా మారిన కమెడియన్

హాస్యనటులు దర్శకులుగా మారకూడదా? ఎందుకు మారకూడదు? ఎంతోమంది కమెడియన్లు డైరక్టర్లు అయ్యారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హాస్యనటుడు కూడా చేరాడు. అతడే శ్రీనివాసరెడ్డి. కమెడియన్ గా తనదైన ముద్రవేసిన ఈ నటుడు, మెగా ఫోన్ పట్టాడు. ఓ సినిమా తీశాడు. దాని పేరు భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు.

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న హాస్యనటులంతా కలిసి ఫ్లయింగ్ కలర్స్ పేరుతో ఎప్పటికప్పుడు గెట్-టు-గెదర్స్ పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా కలుస్తున్న వీళ్లంతా నిర్మాతలుగా మారి, అదే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు.

వీళ్లంతా కలిసి ఓ సబ్జెక్ట్ ఫైనలైజ్ చేశారు. ఆ కథకు దర్శకత్వం వహించే బాధ్యతల్ని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. అలా దర్శకుడిగా మారిపోయాడు కమెడియన్ శ్రీనివాసరెడ్డి. తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు.

బ్రహ్మానందం నుంచి షకలక శంకర్ వరకు దాదాపు హాస్యనటులంతా ఈ సినిమాలో ఉన్నారు. మూవీ మొత్తం ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందట. గుట్టుచప్పుడు కాకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. 

సెక్స్ కు మనిషిని దూరం చేస్తున్న ఇంటర్నెట్!