cloudfront

Advertisement


Home > Movies - Movie News

ప్రాణ త్యాగానికి నేను రెడీ.. మరి మీరు: పోసాని

ప్రాణ త్యాగానికి నేను రెడీ.. మరి మీరు: పోసాని

తెలుగుదేశం నేతలకు ప్రముఖ నటుడు పోసాని మురళీ కృష్ణ ఒక సవాల్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేయడానికి సిద్దమని, తాను విజయవాడ నడిరోడ్డుమీద దీక్షకు సిద్దమని, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు అంతా సిద్దమేనా అని ఆయన ప్రశ్నించారు.

మేం ఏసీ రూముల్లో కూర్చొని కులుకుతామని టీడీపీ నాయకులు అంటున్నారు. అవును, మాకు ఏదీ చేతకాదనుకుందాం, మరి మీరేం చేస్తున్నారు? ప్రత్యేక హోదా కోసం విజయవాడలో దీక్షకు వచ్చిన సినిమా వాళ్లని లాఠీలతో కొట్టించింది మీరుకాదా, ఒక్కొక్కరినీ తరిమితరిమి కొట్టిన సంగతి మర్చిపోయారా?

నిన్నటిదాకా మీరేం మాట్లాడారు.. హోదా కోసం మాట్లాడినవాళ్లను చెత్తవెధవలని అనలేదా? మళ్లీ మీరిప్పుడు సడన్‌గా హోదా కావలంటుంటే మేం మద్దతివ్వాలా?

టాలీవుడ్‌ తరఫున నేనూ ఆమరణదీక్షకు కూర్చుంటా. మళ్లీ చెబుతున్నా.. హోదా కోసం ప్రాణత్యాగానికి కూడా నేను సిద్ధం.. టీడీపీ నేతలు కూడా సిధ్దమే అయితే రండి. అలా కాకుండా నోటికొచ్చినట్లు కూస్తే మాత్రం నేను సహించను అని పోసాని అన్నారు.